వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పరిశ్రమ రాకపోగా, వచ్చినవి కూడా వెనక్కి పోయాయంటూ గత వైసీపీ ప్రభుత్వం పాలనపై కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విమర్శలు చేశారు.

Bhupati Raju Srinivas Varma : వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో నాకు అప్పగించిన బాధ్యతలను స్వీకరించాను.. నాకు కీలకమైన బాధ్యతలు ఇచ్చిన ప్రధానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు సహకరించిన బీజేపీ నాయకులందరికి ధన్యవాదాలు. నాకు కేటాయించిన శాఖల్లో మెరుగైన ఫలితాలకోసం నా వంతు కృషి చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతానని శ్రీనివాసవర్మ అన్నారు.

Also Read : పవన్ కల్యాణ్ ఓకేఅంటే అదే క్యాంపు కార్యాలయం.. గతంలో దేవినేని, బొత్స..

గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పరిశ్రమ రాకపోగా, వచ్చినవి కూడా వెనక్కి పోయాయంటూ గత వైసీపీ ప్రభుత్వం పాలనపై శ్రీనివాస్ వర్మ విమర్శలు చేశారు. రాబోయేకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకోసం ప్రత్యేకమైన కార్యాచరణతో, రాష్ట్రం అభివృద్ధికోసం అందరితో కలిసి సమన్వయంతో ముందుకు అడుగులు వేస్తామని చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రయతిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ లో గల సమస్యలు, ఉద్యోగుల భద్రత, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకు అనుగుణంగా ముందుకు అడుగులు వేస్తామని అన్నారు. కేంద్ర బొగ్గు గనులు శాఖల మంత్రి కిషన్ రెడ్డితో వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ కొరకు మాట్లాడుతానని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.

Also Read : ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు.. అన్నికూడా డిస్ ఇన్వెస్ట్ మెంట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాలసీ తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై గతంలో కొన్ని అంశాలను వివరించాము. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మా పార్టీ నేతలతో కలిసి ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి స్థానిక పరిస్థితులను వారి దృష్టికి తీసుకెళ్తాం. కేంద్ర పాలసీకి నేను వ్యతిరేకంగా ఎలాంటి వ్యాక్యలు చేయను. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ దెబ్బతినకుండా ఏపీ ప్రజల ప్రయోజనాలు కాపాడడంకోసం ప్రయత్నిస్తానని భూపతి రాజు శ్రీనివాసవర్మ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు