Srisailam Temple : మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వడ ప్రసాదం మళ్లీ ప్రారంభం

Srisailam Temple : పులిహోర, లడ్డుతో పాటు నేటి నుండి వడ ప్రసాదం కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు.

Srisailam Temple - Vada Prasadam (Photo : Google)

Srisailam Temple – Vada Prasadam : నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వడ ప్రసాదం ప్రారంభమైంది. గతంలో ఆగిపోయిన వడ ప్రసాదం మళ్ళీ భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శ్రీశైలం మల్లన్న భక్తులకు వడ ప్రసాదాన్ని దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది.

45 గ్రాముల వడ 20 రూపాయల ధరతో భక్తులకు విక్రయిస్తున్నారు. పులిహోర, లడ్డుతో పాటు నేటి నుండి వడ ప్రసాదం కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు. స్వామి అమ్మవార్లకు పూజాదికాలు చేసి వడ ప్రసాదం ప్రారంభించారు ఈవో లవన్న.

Also Read..Adipurush review : నిరాశ‌ప‌రిచింది.. భారీ గంద‌ర‌గోళాన్ని సృష్టించింది.. అంచ‌నాల‌ను అందుకోలేదు

నిత్యం వేల మంది భక్తులు శ్రీశైలానికి వస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఇలా ప్రతి రోజు వచ్చే భక్తుల కోసం పులిహోర, లడ్డులతో పాటు వడ ప్రసాదం తయారు చేయిస్తామని ఈవో లవన్న వెల్లడించారు. భక్తులకు ప్రసాదాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు ఈవో లవన్న.

”ప్రసాదాల విక్రయ కేంద్రాల్లో లడ్డూ, పులిహోరలతో పాటు వడ ప్రసాదం కొనుగోలు చేయొచ్చు. 45 గ్రాముల వడ ప్రసాదం ధర రూ.20. శుక్రవారం నుంచి వడ ప్రసాదం విక్రయం ప్రారంభించాం” అని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. తొలుత ఈవో లవన్న వడ ప్రసాదం కొనుగోలు చేశారు. అనంతరం విక్రయాలను ప్రారంభించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వడ ప్రసాదాలు తయారు చేసి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు ఈవో లవన్న.

Also Read..Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

ట్రెండింగ్ వార్తలు