ఘోర ఓటమి షాక్ నుంచి వైసీపీ ఇంకా కోలుకోవడం లేదు. క్యాడర్ నుంచి లీడర్ల వరకు అందరూ అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతల ఓపెన్ స్టేట్‌మెంట్లు చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్న కొందరు వైసీపీ నేతలు..తమ పార్టీలో కొందరు లీడర్లు మాట్లాడిన తీరే డ్యామేజ్ చేసిందని చెప్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫస్ట్ టైమ్ ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టార్గెట్‌గా తమ పార్టీ నేతలు చేసిన కామెంట్స్‌ను..టీడీపీ అస్త్రంగా మల్చుకుందని అన్నారు. చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంతో ఆ ఇష్యూను సానుభూతిగా మల్చుకోవడంలో కూటమి సక్సెస్ అయిందని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వేళ మరో నేత వాయిస్ రేజ్ చేశారు. ఏకంగా బ్లాసింగ్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వాసుపల్లి గణేష్. తమ పార్టీ నేతలు ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామంటున్న వాసుపల్లి..విజయసాయిరెడ్డి మాదిరిగా వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా పార్టీని వీడి వెళ్లిపోతే మంచిదన్నట్లుగా మాట్లాడారు. మాజీమంత్రి రోజా ఆచితూచి మాట్లాడితే బెటర్ అని సూచించారు.
Telangana Politics: ఆ 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారా?
విజయసాయిరెడ్డి పార్టీని వీడటం శుభసూచకమన్న వాసుపల్లి..ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే ఉత్తరాంధ్రలో పార్టీ ఓడిపోయిందంటున్నారు. పార్టీ కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన సాయిరెడ్డి..పార్టీకి సమస్యగా మారారని గుర్తు చేస్తున్నారు. సాయిరెడ్డి జగన్‌ను మిస్ గైడ్ చేశారని చెప్పారు. సాయిరెడ్డి వల్లే రుషికొండ ప్యాలెస్ కట్టాల్సి వచ్చిందన్నారు.
ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని..
కొడాలి నాని, వంశీ పార్టీకి డేంజర్‌గా తయారయ్యారని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి రోజా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయొద్దన్నారు వాసుపల్లి. 9 నెలలుగా కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నామని, ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని చెప్పుకొచ్చారు. వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో వాసుపల్లి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇలా వైసీపీ లీడర్లు..సొంత పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
ఒకరి తర్వాత మరో నేత..అసంతృప్తి గళం వినిపించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయట. వ్యక్తిగతంగా గతంలో తమకు పార్టీలో అన్యాయం జరిగిందనుకున్న నేతలు..ఇప్పుడు విపక్షంలో అపోజిషన్ వాయిస్ వినిపిస్తున్నారట. ఇక ఎంత చెప్పినా వినలేదని..అందువల్లే నష్టపోయామని బాధ పడుతున్నవాళ్లు ఉన్నారట.
మరికొందరు నేతలు మాత్రం సొంత పార్టీ నేతల తప్పిదాలను ఎత్తిచూపి..కూటమికి దగ్గరయ్యే ప్లాన్ చేస్తున్నారట. ఈ లిస్ట్‌లో కేతిరెడ్డి, వాసుపల్లి ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కేతిరెడ్డి జనసేనలోకి వెళ్తారన్న టాక్ వినిపించింది. ఆయన సూటిగా, సుతిమెత్తగా, సున్నితంగా అపోజిషన్ వాయిస్ వినిపించడంతో..జంపింగ్‌కు దారి వెతుక్కుంటున్నారన్న ప్రచారం జరిగింది.
గతంలోనే ఆగ్రహం
వాసుపల్లి గణేష్ కూడా అదే లిస్ట్‌లో ఉన్నారట. వైసీపీలో చేరినప్పటి నుంచి వాసుపల్లికి అవమానాలే ఎదరయ్యాయట. విశాఖ సౌత్ నియోజకవర్గంలో మరో నేతను విజయసాయిరెడ్డి ప్రోత్సహిస్తున్నారని గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు వాసుపల్లి. సాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ సాఫ్ట్‌గా మాట్లాడితే వాసుపల్లి మాత్రం వైలెంట్‌గా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్ నడుస్తుంది.
ఇలా వైసీపీ నేతలు మేలుకొలుపు రాగం ఎత్తుకోవడం వెనుక ఏదో ఒక ప్లాన్ ఉందన్న చర్చ నడుస్తోంది. తాము కష్టపడి పనిచేసినా..అధినేతతో పాటు కొందరు నేతల తీరు వల్లే ఓడిపోయామని బాధ పడుతున్నవాళ్లు కొందరు ఉన్నారట. ఇక అపోజిషన్‌లో ఉండలేక.. అధికార కూటమి వైపు మొగ్గు చూపుతున్న లీడర్లు మరికొందరు.
అందుకే వైసీపీ నేతలు సరికొత్త రాగం ఎత్తుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ వేళ వాసుపల్లి చేసిన కామెంట్స్ అయితే కాక రేపుతున్నాయి. వంశీని వెనకేసుకొస్తూ వైసీపీ నేతలు స్టేట్‌మెంట్లు ఇస్తుంటే..అదే పార్టీకి చెందిన వాసుపల్లి మాత్రం స్ట్రాంగ్ వాయిస్ వినిపించడం హాట్ టాపిక్ అవుతోంది. ఇలా స్టేట్‌మెంట్లు ఇస్తున్న నేతలను వైసీపీ అధిష్టానం కంట్రోల్ చేస్తుందా..లేక లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.