Tirumala Tirupati: రెండేళ్ల తర్వాత.. భక్తుల సమక్షంలో వేంకన్న బ్రహ్మోత్సవాలు.. శ్రీవారి వాహనసేవల వేళలు విడుదల

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో వేంకన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

Tirumala Tirupati: తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో వేంకన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు జరగనున్న వాహన సేవల వివరాలను టీటీడీ ప్రకటించింది. బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్, శ్రీవాణి ట్రస్టు దర్శనాలన్నీ రద్దు చేశామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

Tirumala Brahmotsavams

శ్రీవారి వాహన సేవల వేళలు ..

సెప్టెంబర్ 26న : బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ (రాత్రి 7 నుంచి 8గంటలు)
సెప్టెంబర్ 27న : ధ్వజారోహణం( సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటల వరకు), పెద్ద శేష వాహన సేవ ( రాత్రి 9 నుంచి 11గంటల వరకు)
సెప్టెంబర్ 28న : చిన్నశేష వాహనం (ఉదయం 8 గంటల నుంచి 10 వరకు), స్నపన తిరుమంజనం, హంస వాహన సేవ (రాత్రి 7నుంచి 9గంటల వరకు)
సెప్టెంబర్ 29న : సింహ వాహన సేవ (ఉదయం 8 నుంచి 10 గంటల వరకు), ముత్యపు పందిరి వాహన సేవ (రాత్రి 7 నుంచి 9గంటల వరకు)
సెప్టెంబర్ 30న : కల్పవృక్ష వాహన సేవ (ఉదయం 8 నుంచి 10గంటల వరకు), సర్వ భూపాల వాహన సేవ ( రాత్రి 7 నుంచి 9 గంటల వరకు)
అక్టోబర్ 1న : మోహిని అవతారంలో స్వామివారి దర్శనం (ఉదయం 8 నుంచి 10 గంటల వరకు), గరుడ వాహన సేవ ( రాత్రి 7గంటలకు)
అక్టోబర్ 2న : హనుమంత వాహన సేవ (ఉదయం 8 నుంచి 10గంటల వరకు), గజ వాహన సేవ (రాత్రి 7 నుంచి 9గంటల వరకు)
అక్టోబర్ 3న : సూర్యప్రభ వాహన సేవ (ఉదయం 8 నుంచి 10 గంటల వరకు), చంద్రప్రభ వాహన సేవ (రాత్రి 7 నుంచి 9గంటల వరకు)
అక్టోబర్ 4న : రథోత్సవం ( ఉదయం 7గంటల నుంచి), అశ్వ వాహన సేవ (రాత్రి 7 నుంచి 9గంటల వరకు)
అక్టోబర్ 5న : చక్రస్నానం (ఉదయం 6 నుంచి 9గంటల వరకు), ధ్వజావరోహణం ( రాత్రి 9 నుంచి 10 గంటల వరకు)

ట్రెండింగ్ వార్తలు