Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు..!

కాపు ఉద్యమ నేత ముద్రగడ కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్టు తెలుస్తోంది.

Mudragada Padmanabham

Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ కన్నుమూశారు. గతకొంతకాలం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్టు తెలుస్తోంది. గత నెల రోజులుగా హైదరాబాద్ హైటెక్ సిటీ సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. శ్వాస కోస సంబంధిత వ్యాధితో వెంటిలేటర్‌పై ముద్రగడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

ముద్రగడ రాజకీయ ప్రస్థానం మొదలైందిలా.. :
1953లో జనవరి 22న ముద్రగడ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామంలో జన్మించారు. జనతా పార్టీ నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన తొలిసారి ఎన్నికయ్యారు. టీడీపీలో చేరి ప్రత్తిపాడు నుంచి ముద్రగడ గెలిచారు. అలాగే, ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.

ఆ తర్వాత రాజీనామా చేసి ప్రజా రక్షణ సమితి పార్టీని కూడా స్థాపించారు. 1999-2004 మధ్య టీడీపీ తరపున లోక్ సభ నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. 1995-1999 మధ్య బీజేపీలో కొంతకాలం కూడా ముద్రగడ పనిచేశారు. 2024 మార్చి 15నలో వైసీపీలో ఆయన చేరారు.

Read Also : SIR KTR Family : ఓటరు జాబితా సవరణలో కేటీఆర్ కుటుంబం.. SIR‌పై వీడియో వైరల్

ఏపీ రాజకీయాల్లో ముద్రగడ కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేతగా కూడా గుర్తింపు పొందారు. ముద్రగడ రాజకీయ ప్రస్థానంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం కీలక మలుపుగా నిలిచింది. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆయన అనేక నాయకత్వం వహించారు.

ముఖ్యంగా 2016లో తుని ఘటన నేపథ్యంలో కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ఈ ఉద్యమం అప్పటి టీడీపీ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచింది. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్నారు.

కాపు హక్కుల అంశాలపై ఎక్కువగా స్పందించేవారు. దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ అంశాల్లో చురుకుగా ఉన్న ముద్రగడ ఏపీ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

కాపు ఉద్యమ నేతగా ఎన్నో ఉద్యమాలు చేశారు. పుష్కర పోలవరం కాలువలలో భూములు కోల్పోయిన రైతుల కోసం కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 2024 ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు.