Vijayasai Reddy: జగన్‌కు విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ.. నాది నమ్మకద్రోహమా.. ‘కోటరీ’పై సంచలన ఆరోపణలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ రాశారు.

Vijayasai reddy open letter to jagan sensational allegations on kotari and sajjala

  • జగన్‌కు విజయసాయి సంచలన లేఖ
  • కోటరీ రాజకీయాలపై తీవ్ర ఆగ్రహం
  • నమ్మకద్రోహం ప్రచారానికి చెక్

Vijayasai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా సాగుతున్న తీవ్ర అంతర్గత విబేధాలు, ఆరోపణల నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద తుఫాను రేపింది. తనపై ‘నమ్మకద్రోహి’ అని కోటరీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు అనేక సంచలన విషయాలను ఈ సుదీర్ఘ లేఖ ద్వారా ఆయన బయటపెట్టారు. 2019 ఎన్నికల విజయం తర్వాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభావంపై జగన్ పునరాలోచించుకోవాలని సూచించారు.

Suryapet Double Murder: వేపచెట్టు వివాదం, 25 ఏళ్లుగా గొడవలు.. ఇద్దరి హత్య.. తండ్రినే నరికేసిన కొడుకు

కోటరీపై తీవ్ర విమర్శలు – సజ్జల పాత్రపై నిలదీత:

పార్టీ కోసం తాను చేసిన సేవలను, ఎదుర్కొన్న జైలు జీవితాన్ని గుర్తుచేస్తూ, 2020 నుంచి తన పట్ల జరిగిన అవమానాలను విజయసాయి లేఖలో వివరించారు. తాను నిజంగా నమ్మకద్రోహినైతే ఎప్పుడో అప్రూవర్‌గా మారేవాడినని, జగన్ తనకు ఇచ్చిన రెండు రాజ్యసభ అవకాశాలకు కృతజ్ఞుడనై ఉంటానని స్పష్టం చేశారు. 2022 ప్లీనరీ నాటి నుండి తనను కోర్ కమిటీ నుంచి తొలగించి దూరంగా పెట్టడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఎంత ఉందో జగన్ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సజ్జల వల్లే 2029లో కూడా పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరించారు.

కుటుంబంపై దృష్టి పెట్టాలని సూచన:

రాబోయే రోజుల్లో మీడియా ముందుకు వచ్చి మరిన్ని నిజాలను ఆధారాలతో సహా బయటపెడతానని విజయసాయి రెడ్డి ప్రకటించారు. తన సంగతి పక్కనబెట్టి వైఎస్ వివేకానందరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి సొంత కుటుంబ సభ్యుల విషయంలో జగన్ దృష్టి సారించాలని హితవు పలికారు. సేవ చేసిన నేతలను విస్మరించి, చుట్టూ ఉన్న కోటరీ మాటలు వింటే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలు, అభిమానులు ఈ నిజాలను గ్రహించి నమ్మకద్రోహం ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.