Vijayawada : దుర్గగుడి పాలకమండలి కీలక తీర్మానాలు.. వృద్ధులు, వికలాంగులకు వాహనాలు.. ఏడాదిలోపు చిన్న పిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్

అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. దుర్గా ఘాట్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా, యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామని పేర్కొన్నారు.

Vijayawada Durgagudi

Vijayawada Durgagudi Governing Body : విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక తీర్మానాలు తీసుకుంది. దుర్గగుడి పాలకమండలి పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మీడియాకు తీర్మానాల వివరాలను వెల్లడించారు. శివాలయాన్ని త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

శివాలయంలో రూ.40 లక్షల అంచనాతో నవగ్రహమండపం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్ వాహనాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏడాది లోపు చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. దూరప్రాంత భక్తుల కోసం మహామండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Vinayaka Chavithi : సెప్టెంబర్ 19న వినాయక చవితి.. 28న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

నామమాత్రపు రుసుముతో డార్మిటరీలో బసకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ మీద వెళ్లే భక్తులకు కనిపించేలా అమ్మవారి చిత్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. బంగారు ఆభరణాల డోనర్స్ కు అందుబాటులో ఉండేలా మరో గోల్జ్ అప్రైజర్ ను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్న నూతన జంటకు మ్యారేజ్ టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. దుర్గా ఘాట్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా, యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామని పేర్కొన్నారు. అమ్మవారి సేవలకు ప్రచారం కల్పించేందుకు ఏపీ ఫైబర్ నెట్ కూడా అంగీకారం తెలిపిందని చెప్పారు.

Swami Prasad Maurya: హిందూ మతమనేదే లేదు, బ్రాహ్మణిజాన్ని అలా పిలుస్తున్నారు.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వామి ప్రసాద్ మౌర్య

టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్డీఎమ్బీసీ ఛానల్ లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అమ్మవారి కుంకుమ ప్రసాదం ప్రతీ భక్తుడికి ఇచ్చే కార్యక్రమాన్ని పౌర్ణమి రోజన ప్రారంభిస్తామని చెప్పారు. రెండు వేల మంది ఒకేసారి అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవన్ ను విస్తరిస్తున్నామని తెలిపారు. అన్నదాన భవన్ కు రాబోయే నెల రోజుల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు.