Vijaya Sai Reddy
దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయన్న విషయంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2027లో జమిలి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలను కూటమి నేతలు గ్రామాల నుంచి తరిమేస్తున్నారని ఆరోపించారు.
గ్రామాల చివర్లో టెంట్లు వేసుకుని ఉండే భయానక వాతావరణం సృష్టించారని విజయసాయిరెడ్డి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఈ పరిస్థితి లేదని తెలిపారు. కాకినాడ సీ పోర్టులో కేవీ రావు ఎవరో తెలియకపోయినా తనపై కేసు పెట్టారని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక ఆ కేసులు తిరిగి వెంటాడుతాయి అని గుర్తు పెట్టుకోవాలని విజయసాయిరెడ్డి చెప్పారు. అవసరమైతే 3, 4 నెలలు జైల్లోకి వెళ్లినా పోరాటం చేస్తామని తెలిపారు. తన మీద లుక్ అవుట్ నోటీస్ ఎందుకని ప్రశ్నించారు. పిలిస్తే తాను సీఐడీ ఆఫీస్ కు వస్తానని.. అరెస్టు చేసుకోవాలని చెప్పారు.
బెయిల్ పిటిషన్ కూడా వేయనని, భయపడేది లేదని విజయసాయిరెడ్డి అన్నారు. భయం వైసీపీ నాయకుల రక్తంలో లేదని చెప్పారు. తాను విశాఖలో ఒక్క సెంట్ ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేయలేదని అన్నారు. బంధువులు కోనుగోలు చేస్తే తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
KTR: ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు