కరోనా మృతదేహాలను ఖననం చేసి వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకున్న గ్రామస్తులు

  • Publish Date - July 3, 2020 / 09:00 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం ఫ్లైవోర్ బ్రిడ్జీ దగ్గర ఉద్రిక్తత చోటు చేైసుకుంది. కరోనాతో చనిపోయిన వారిని క్రిస్టియన్ పాలెం స్మశాన వాటికలో ఖననం చేసి వెళ్తున్న అంబులెన్స్ ను స్థానికులు అడ్డుకున్నారు. మూడు అడుగుల లోతులోనే మృత దేహాలను ఖననం చేశారంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు ఆందోళనకారులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ సమీపంలో తూర్పు క్రిస్టియన్ పాలెం సమీపంలో ఉన్న స్మశాన వాటికలో 3 కరోనా మృతదేహాలను ఖననం చేశారు. ఈ విషయం తెలుసున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనా ప్రాంతంలో ఫ్లైవోర్ బ్రిడ్జీపై కదులుతున్న అంబులెన్స్ ను అడ్డుకుని, అష్టదిగ్బంధనం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. సంఘనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అయితే మూడు అడుగుల లోతులోనే మృతదేహాలను పాతి పెట్టారు. దీంతో తాము భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. మూడు అడుగుల లోతులోనే పూడ్చి పెట్టడం ద్వారా తమ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ వ్యాపించనట్లైతే తాము దాని బారిన పడే అవకాశం ఉందని పోలీసుల ఎదుటు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ లోపాన్ని గుర్తించిన పోలీసులు తప్పు జరిగిందని చెప్తూ మరోసారి ఈ విధంగా జరుగకుండా తొమ్మిది అడుగుల లోతులో పూడ్చి పెట్టాలని వైద్యాధికారుల నిబంధనలు చెబుతున్నాయి. ఆ తప్పును గుర్తించిన పోలీసులు అధికారులు మరోసారి జరుగకుండా చూసుకుంటామని స్థానికులకు చెప్పారు.