Pregnant Woman : నాగావళి నదిలో నిండు గర్భిణి అవస్థలు

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కురుపాం నియోజకవర్గంలో ఒక బాలింతరాలిని సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతో స్ట్రెచర్ పై మోసుకుంటూ... నాగావళి  నదిని దాటారు ఆమె కుటుంబ సభ్యులు, 108 సి

Preganent Kashtalu

Pregnant Woman :  మౌలిక వసతులు ఎన్ని కల్పించినా… ఆస్పత్రులు కట్టించి ఎంత అభివృధ్ది చెందినా ఇంకా ఏపీ లోని కొన్ని గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు లేకపోవటం విస్మయాన్ని కలగచేస్తోంది. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కురుపాం నియోజకవర్గంలో ఒక బాలింతరాలిని సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతో స్ట్రెచర్ పై మోసుకుంటూ… నాగావళి  నదిని దాటారు ఆమె కుటుంబ సభ్యులు, 108 సిబ్బంది.

కొమరాడ మండలం చోళపదం పంచాయతీ నాగావళి నదికి ఆనుకొని ఉన్న ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు గ్రామం.  చోళపదం పంచాయతీలో వనధార గిరిజన గ్రామం ఉంది. గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ చామంతికి మంగళవారం ఉదయం పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమె భర్త నాగేశ్వరరావు 108 సిబ్బంది కి ఫోన్ లో సమాచారం ఇచ్చారు.

108 సిబ్బంది ఒరిస్సా గ్రామం వత్తాడ వద్దకి చేరుకున్నారు. వనధార వెళ్లాలంటే నాగావళి నదిని దాటాలి అక్కడ సరైన వంతెన లేకపోవటంతో 108 సిబ్బంది స్ట్రెచర్ తీసుకుని గ్రామానికి కాలి నడకన వెళ్లారు. అక్కడ గ్రామస్తుల సహాయంతో చామంతిని  స్ట్రెచర్ పై పడుకోబెట్టి నాగావళి నదిని దాటి..వత్తాడ గ్రామం వద్దకు చేర్చారు.

Also Read : TTD : టీటీడీ కేసు వాదించటానికి తిరుపతి వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి

అక్కడి నుంచి ఆమెను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి  క్షేమంగా  తరలించారు. ఇలాంటి ఘటన వనధార గ్రామంలో జరగటం మూడోసారి అని గ్రామస్తులు తెలిపారు.  ఒక వేళ నది దాటుతున్నప్పుడు ఆమెకు నొప్పులు ఎక్కువైనా ఇబ్బందే… నది పొంగినా ఇబ్బందే.  కనుక  పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు సకాలంలో పూర్తి చేస్తే నాగావళి నది అవతల ఒడ్డున ఉన్న గిరిజన గ్రామ ప్రజలకు విద్య, వైద్యం అందుతాయని స్ధానికులు కోరుతున్నారు.