Vinukonda MLA: పండుగలకు ముఖ్యంగా న్యూఇయర్ లాంటి వేడుకలకు పెద్ద వాళ్లకు కానుకలు ఇచ్చి విషెస్ చెబుతుంటాం. కానీ, ఏకంగా ఎమ్మెల్యేనే గ్రీటింగ్ కార్డుతో సహా విష్ చేయడం ఎప్పుడైన విన్నారా.. వినుకొండ ఎమ్మెల్యే చేసిన కొత్త ప్రయత్నమే ఈ గ్రీటింగ్ కార్డ్ న్యూ ఇయర్ విషెస్.
గ్రీటింగ్ కార్డు పంపి, అందులో ప్రజలకు జవాబుదారీతనంగా తాను నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వివరించారు. గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. ఈ పని చేసి నియోజకవర్గంలో ప్రజల్లో మరింత అభిమానం గెలిచేసుకున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున పోటీచేసి..ఒక సామాజిక వర్గమే మెజారిటీగా ఉండే టీడీపీ కంచుకోట వినుకొండను దాదాపు 30వేల ఆధిక్యంతో గెలిచారు. విజయం పొందినప్పటి నుంచి నిత్యం నియోజకవర్గంలో ఉంటూ దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తూ జనంలో మంచి మార్కులు కొట్టేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రతి ఇంటికి తాను చేసిన.. చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాలతో 91 వేల ఇళ్లకు గ్రీటింగ్ కార్డు పంపి భేష్ అనిపించుకున్నారు.