Viral Video: శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన భారీ తిమింగలం.. స్థానికులు దానిపైకి ఎక్కి…

పాత మేఘవరం - డి.మరువాడ సముద్ర తీరం వద్ద కనపడిన ఈ భారీ తిమింగల కళేబరం దాదాపు 25 అడుగుల పొడవు ఉంది.

Blue Whale

Blue Whale – Srikakulam: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరానికి ఓ భారీ నీలి తిమింగల కళేబరం కొట్టుకువచ్చింది. సంతబొమ్మాళి మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాత మేఘవరం – డి.మరువాడ సముద్ర తీరం వద్ద కనపడిన ఈ భారీ తిమింగల కళేబరం దాదాపు 25 అడుగుల పొడవు ఉంది.

దీన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు ఆ తిమింగల కళేబరంపైకి ఎక్కి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తిమింగలం బరువు దాదాపు మూడు టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది. దాని చుట్టూ చేరి కొందరు వీడియోలు తీసుకుంటున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఒడిశా తీరంలోనూ ఇటువంటి భారీ తిమింగలమే కనపడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో తిమంగలాలు మృతి చెంది తీరాలకు కొట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది.

Delhi-Mumbai Flight : విమానంలో ప్రొఫెసర్ వెర్రివేషాలు .. మహిళా డాక్టర్‌‌పై లైంగిక వేధింపులు,అరెస్ట్