Delhi-Mumbai Flight : విమానంలో ప్రొఫెసర్ వెర్రివేషాలు .. మహిళా డాక్టర్‌‌పై లైంగిక వేధింపులు,అరెస్ట్

చదువుకుని ఉన్నతపదవిలో ఉన్నా సంస్కారం మాత్రం లేదు. మహిళా డాక్టర్ తో విమానంలో అసభ్యంగా ప్రవర్తించి అరెస్ట్ అయ్యాడు.

Delhi-Mumbai Flight : విమానంలో ప్రొఫెసర్ వెర్రివేషాలు .. మహిళా డాక్టర్‌‌పై లైంగిక వేధింపులు,అరెస్ట్

Professor Arrested For Harassing Woman doctor In Flight

Professor For Harassing Woman doctor : సంస్కారం లేని చదువులు ఎందుకు అంటారు పెద్దలు. ఉన్నత చదువులు చదువుకున్న గౌరవమైన స్థానంలో ఉండి కూడా నీచపు పనులు చేసే ప్రబుద్ధులు ఆ బాద్యతలకే తలవంపులు తెస్తుంటారు. అటువంటివాడే ఈ ప్రొఫెసర్ కూడా. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రొఫెసర్ మహిళా డాక్టర్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. విమానంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో (Delhi-Mumbai Flight) మహిళా డాక్టర్ ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో 47 ఏళ్ల ప్రొఫెసర్ ను పోలీసులు అరెస్ట్ (Professor Arrested) చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం (జులై 28,2023) పోలీసు అధికారి వెల్లడించారు.

ఈరోజు తెల్లవారుజామున 5.30గంటలకు ఢిల్లీ నుంచి ముంబైకు విమానం బయలుదేరింది. ఆ విమానంలో 24 ఏళ్ల యువతి, ఆమె పక్కనే ఓ ప్రొఫెసర్ కూర్చున్నారు. ఆమె ఓ డాక్టర్. విమానం ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావటానికి కొద్దిసేపు ఉందు సరదు ప్రొఫెసర్ ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆమె సదరు ప్రొఫెసర్ ను హెచ్చరించింది. తరువాత కూడా అతను మరోసారి అలాగే ప్రవర్తించటంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. విమానం ముంబైలో ల్యాండ్ అవ్వగానే ఆమె సహార్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో సదరు ప్రొఫెసర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచారు. అనంతరం అతను బెయిల్ ఇవ్వాలని కోరటంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై విచారణ జరుగోతందని పోలీసులు తెలిపారు.