Swaroopanandendra Saraswati : విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజిన ప్రాంతాలే లక్ష్యంగా విదేశీ మత మార్పిడులకు కుట్ర జరుగుతోందన్నారు. దీనిని అడ్డుకునేందుకే ఇవాళ భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. గిరిజనులకు రగ్గులు, భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
గిరిజన ప్రాంతాలు ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడటం గిరిజనులకు అదృష్టం అన్నారు. తక్షణమే ఈ ప్రాంతాల్లో జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ సంపద దోపిడీని అడ్డుకున్న గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ స్వామి స్వరూపానందేంద్ర మండిపడ్డారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
జైలల్లో మగ్గిపోతున్న ఆదివాసీలకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు ఎప్పుడూ విశాఖ శారదాపీఠం అండగా ఉంటుందని, గిరిజనులంతా ఆంజనేయుడి వారసులని ఆయన అన్నారు. అన్య మతాలను ఆచరించవద్దని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర గిరిజనులను కోరారు.