ర్యాలీలో పాల్గొనకపోతే రుణమాఫీతో పాటు అన్ని పథకాలు కట్, విశాఖ వైసీపీలో ఆడియో టేప్ కలకలం

  • Publish Date - November 18, 2020 / 05:32 PM IST

Visakha YCP Leaders Audio Tape Leak: విశాఖపట్నం వైసీపీలో మరో కలకలం రేగింది. పెందుర్తి నియోజకవర్గంలో విశాఖ రూరల్ అధ్యక్షుడు చిన అప్పలనాయుడు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పాదయాత్రలో పాల్గొనాలంటూ డ్వాక్రా సంఘాల మహిళలకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలో పాల్గొనకపోతే రుణమాఫీతో పాటు అన్ని పథకాలు కట్ అవుతాయని చిన అప్పలనాయుడు చెప్పారంటూ డ్వాక్రా సంఘాల లీడర్ ఆర్పీ ప్రభ మహిళలను హెచ్చరించారు.



పాదయాత్రలో పాల్గొనకపోయినా, మధ్యలో వెళ్లిపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఆధార్ కార్డు వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని, లేకపోతే పథకాలు అందవని హెచ్చరించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఆడియో టేప్ ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపుతోంది.