హత్య? ఆత్మహత్య? విశాఖలో మృతదేహం కలకలం, నడిరోడ్డుపై మంటల్లో సజీవదహనం

  • Publish Date - September 21, 2020 / 11:27 AM IST

విశాఖలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తి మంటల్లో కాలిబూడిదయ్యాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేశారా? విశాఖలో చోటు చేసుకున్న ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పెట్రోల్ అంటుకుని మంటల్లో కాలిబూడద:
గాజువాకలో ఈ ఉదయం వ్యక్తి మృతి కలకలం రేపింది. నడిరోడ్డుపై పెట్రోల్‌ అంటుకుని ఓ వ్యక్తి మంటల్లో కాలిబూడిదయ్యాడు. పక్కనే ఉన్న ఓ దుకాణ యజమాని ఇది చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చే లోపే వ్యక్తి మృతి చెందాడు. అసలు ఆ వ్యక్తికి మంటలు ఎలా అంటుకున్నాయి? అన్న వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.


మృతుడు లారీ డ్రైవర్:
నల్గొండ జిల్లాకు చెందిన నరసింహారావు అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లోడ్ తీసుకొని రెండు రోజుల క్రితం గాజువాకకు చేరుకున్నాడు. ఏమైందో తెలీదు, ఈ ఉదయం మంటలు అంటుకుని రోడ్డుపైనే కాలిబూడిదయ్యాడు. ఎవరైనా హత్య చేశారా? లేక అతనే సూసైడ్ చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీలో అతనితో పాటు ఇంకెవరైనా వచ్చారా? అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.