Visakha : ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు తనఖా విషయం నాకు తెలియదు : మంత్రి అవంతి

విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను ప్రభుత్వం తనఖా పెడుతున్న విషయం నాకు తెలియదని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మేలు కోసమేనని అన్నారు. ఆస్తి పన్ను పెంపు ప్రజలకు భారం కాదునీ..రేషనలైజ్డ్ గానే పెంచాలని నిర్ణయించామని వెల్లడించారు.

Minister Avanti Srinivasa Rao : విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను ప్రభుత్వం తనఖా పెడుతున్న విషయం నాకు తెలియదని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మేలు కోసమేనని అన్నారు. ఆస్తి పన్ను పెంపు ప్రజలకు భారం కాదునీ..రేషనలైజ్డ్ గానే పెంచాలని నిర్ణయించామని వెల్లడించారు. కొమ్మాద్ది గ్రామంలో మంత్రి అవంతి విద్యుత్ లైట్లు ను ప్రారంభించారు. గ్రామంలో 39.45 లక్షల ఖర్చుతో నిర్మించిన విద్యుత్ లైట్లు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతున్న సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు.

2014లో విశాఖను చంద్రబాబు రాజధాని చేసి ఉండాల్సిందనీ అప్పుడే చంద్రబాబు అలా చేసి ఉంటే ఈ సమయానికి విశాఖపట్నం హైదరాబాద్ ను తలదన్నేదిగా నిలిచేదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని విశాఖ అభివృద్ధిని చూసి ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా..కొమ్మాద్ది గ్రామంలో మంత్రి అవంతి విద్యుత్ లైట్లు ను ప్రారంభించిన కార్యక్రమానికి విశాఖ మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు