Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏ1, ఏ2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో సుమారు 60 టన్నుల ఉత్పత్తి నాలుగు రోజుల పాటు నిలిచిపోయే అవకాశం ఉందని ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ బెల్టుల ద్వారా బొగ్గు ఐరన్ ఓర్ కు తరలింపు జరుగుతుంది. కన్వేయర్స్ బెల్టులు తెగిపడటంపై కార్మిక సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. త్వరితగతిన కన్వేయర్స్ బెల్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Vizag Steel Plant
మరమ్మతులు చేయడానికి 4 రోజుల సమయం..
శుక్రవారం సుమారు 2 గంటల ప్రాంతంలో కన్వేయర్ ఏ1, ఏ2 బెల్టులు తెగిపడ్డాయి. దీంతో ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకు 15 టన్నులు బ్లాస్ట్ ఫర్నేస్ 1, బ్లాస్ట్ ఫర్నేస్ 2 ఉత్పత్తి జరుగుతుంది. హీట్ మెటల్ తయారు చేసేందుకు ఈ కన్వేయర్ బెల్టులు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ నేపథ్యంలో స్టీల్ తయారు చేయడానికి ముడి సరుకులు ఏవైతే అవసరం ఉంటుందో ఈ బెట్టులు ద్వారానే వస్తాయి. ఇవి తెగిపడటంతో ఒక్కసారిగా ప్రొడక్షన్ అనేది నిలిచిపోయింది. కాగా, వీటిని సెట్ చేయడానికి దాదాపుగా నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
మెయింటెన్స్ లేక తరుచూగా ప్రమాదాలు..!
అయితే, ఎన్నడూ లేని విధంగా ఈ బెల్టులు తెగిపడటం పట్ల కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని కేంద్రం ఇప్పటికే ఈ ప్రతిపాదన పెట్టిన నేపథ్యంలో మెయింటెన్స్ కూడా సరిగా చేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మెయింటెన్స్ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని, పైగా ఉన్న కార్మికుల సంఖ్యను కూడా తగ్గించేస్తోంది. ఫలితంగానే ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. గతంలో సెంట్రల్ ప్లాంట్ లో త్రీ కన్వీనర్ సూట్ కూడా కూలిపోయిందని వాళ్లు ఆరోపిస్తున్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కార్మికులు ఆందోళన..
ఈరోజు ప్లాంట్ లోని కన్వేయర్స్ బెల్టులు అమాంతం కూలిపోవడం, దీని వల్ల సెంట్రల్ మిషన్ కు మెటీరియల్ సప్లయ్ ఆగిపోయిందని కార్మికులు చెబుతున్నారు. సెంట్రల్ మిషన్ ఆగిపోవడం వల్ల బ్లాస్ట్ ఫర్నేస్ లో ఉత్పత్తి ఆగిపోతుందన్నారు.
Visakha Steel Plant
ఇప్పుడిప్పుడే రేటెడ్ కెపాసిటీ నుంచి ప్రొడక్షన్ జరుగుతూ ఉండటం వల్ల స్ట్రక్చరల్ మెయింటెన్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని, గతంలో అనేకసార్లు యాజమాన్యానికి చెప్పడం జరిగిందన్నారు. అయినప్పటికి.. యాజమాన్యం డబ్బులు లేవంటూ మెయింటెన్స్ పై అశ్రద్ధ చేస్తోందని, ఫలితంగా రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read : తాడిపత్రి మహిళలే.. మహిళలా? మరి మిగిలిన వాళ్లు ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాధవీలత ఫైర్