Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏపీకి ప్రమాదకరమని అన్నారు. మళ్లీ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ తన మిత్రులకు లాభం చేకూర్చే నిర్ణయాలను తీసుకుంటుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అమ్మకాలకు పెట్టిందని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ప్రకారం 300 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయని, ఎవరూ కొనుగోలు చేయకపోతే మూసేస్తామని అంటున్నారని తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలో వాగ్ధానాలు చేసి నెరవేర్చలేదని విమర్శించారు. పవన్ ఢిల్లీకి వెళ్లొచ్చాక మాట మార్చారని తెలిపారు. పార్టీలను పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ కోసం అందరూ ఏకం కావాలన్నారు.