విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో చనిపోయినవారి సంఖ్య సంఖ్య 14కు పెరిగింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స అనంతరం కోలుకున్న వెంకటాపురం గ్రామానికి చెందిన యలమంచిలి కనకరాజు(45) సోమవారం(1 జూన్ 2020) చనిపోయాడు. కార్పెంటర్ అయిన కనకరాజుకు భార్య, కుమారుడు ఉన్నారు.
మే ఏడవ తేదీన గ్యాస్ లీక్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన కనకరాజు రెండు రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాడు. అయితే, గత రెండు రోజులుగా ఆయాసం, కడుపు ఉబ్బరం రావడంతో శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు.
కనకరాజు చనిపోవడానికి స్టైరీన్ విష వాయువే కారణం అని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్థులు, నాయకులు డిమాండ్ చేశారు. కనకరాజు మృతితో ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 14కు పెరిగింది.
Read: రైలు దిగగానే పరీక్షలు.. క్వారంటైన్‌కు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం