Vundavalli Sridevi : టీడీపీకి శ్రీదేవి టెన్షన్..! చంద్రబాబు ఏం చేయనున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. Vundavalli Sridevi - TDP
- Naveen
- Published On : August 16, 2023 / 12:19 AM IST
Vundavalli Sridevi - TDP
Vundavalli Sridevi – TDP : అధికార వైసీపీకి ఝలక్ ఇచ్చి టీడీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్న రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని కంగుతినిపించిన శ్రీదేవి కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నా.. కొద్దిరోజుల నుంచి మళ్లీ యాక్టివ్ అయ్యారు. శ్రీకాకుళంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన శ్రీదేవి.. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తళుక్కుమన్నారు.
అంతేకాదు రాజధాని రైతులతో జరిగిన సభలో వ్యాఖ్యాతగా వ్యహరించి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యారు. టీడీపీలో చేరడం లాంఛనమే అయినప్పటికీ ఆ పార్టీలో శ్రీదేవి జర్నీ ఎలా ఉండబోతోంది? అన్నదే ఇంట్రస్టింగ్ గా మారింది. తెలుగుదేశం పార్టీ, ఎమ్మెల్యే శ్రీదేవి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి? ఇంతకీ తెరవెనుక రాజకీయం ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది.
రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. టీడీపీకి ప్రతిష్టాత్మకమైన తాడికొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున సంచలన విజయం సాధించారు. అంతే సంచలనం సృష్టించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు శ్రీదేవి. ప్రస్తుతం ఏ పార్టీలో లేని శ్రీదేవి టీడీపీలో చేరడం ఒక్కటే బ్యాలెన్స్.
2019లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ డాక్టరమ్మ తన గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటోంది అని అసెంబ్లీలో ప్రసంగించి రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు అదే శ్రీదేవి జగన్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదంతా రాజకీయాల్లో భాగమే అయినా ఆమె రాజకీయ భవిష్యత్తుపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. తాడికొండలలో టీడీపీ ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఉన్నారు. గుంటూరు టీడీపీ అధ్యక్షుడిగా పని చేస్తున్న శ్రవణ్ కుమార్ పార్టీ విధేయుడిగా పేరు పొందారు. రాజధాని రైతు ఉద్యమాన్ని నడిపిస్తున్న శ్రవణ్ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని ఎప్పుడో డిసైడ్ అయ్యింది టీడీపీ. అయితే, ఇప్పుడు అనూహ్యంగా శ్రీదేవి ఎంట్రీతో శ్రవణ్ కుమార్ టికెట్ కు ఎర్త్ పెడతారా? అన్న టాక్ నడుస్తోంది.
