Balineni Srinivasa Reddy : వచ్చే ఎన్నికల్లో నా నియోజకవర్గం అదే.. బాలినేని క్లారిటీ.. మాగుంట విషయంపైనా స్పష్టత..

యర్రజెర్లలో పేదలకోసం తాము ఎంపిక చేసిన జగనన్న కాలనీలపై టీడీపీ నాయకుడు దామచర్ల జనార్ధన్ కోర్టులో కేసులువేసి అడ్డుకున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

Balineni Srinivasa Reddy : వచ్చే ఎన్నికల్లో నా నియోజకవర్గం అదే.. బాలినేని క్లారిటీ.. మాగుంట విషయంపైనా స్పష్టత..

Balineni Srinivasa Reddy

YCP MLA Balineni Srinivas Reddy: ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీని వీడుతున్నట్లు కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . వాటిని వైసీపీ శ్రేణులు, నా అభిమానులు పట్టించుకోవద్దని, వైసీపీని వీడే ప్రసక్తి లేదని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీచేస్తానని చెప్పిన బాలినేని, ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారో క్లారిటీ ఇచ్చారు.

CM Shivraj Singh Chouhan : ఏపీ వలంటీర్ వ్యవస్థ, సీఎం కేసీఆర్‌పైనా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి నేను, ఎంపీ నియోజకవర్గం నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి బరిలోకి దిగబోతున్నామని బాలినేని స్పష్టం చేశారు. యర్రజెర్లలో పేదలకోసం తాము ఎంపిక చేసిన జగనన్న కాలనీలపై టీడీపీ నాయకుడు దామచర్ల జనార్ధన్ కోర్టులో కేసులువేసి అడ్డుకున్నారని ఆరోపించారు. కోర్టులో కేసులు వేశాడనే వ్యాఖ్యలపై నేను కట్టుబడి ఉన్నానని, దీన్ని నేను నిరూపిస్తే దామచర్ల జనార్ధన్ తన రాజకీయాలు వదిలేయడానికి సిద్దమా? అంటూ బాలినేని ప్రశ్నించారు.

Tirumala : తిరుమల నడకదారి భక్తులకు కొత్త రూల్స్

ఒకవేళ నిరూపించలేకపోతే నేను రాజకీయాలను వదిలేయడానికి సిద్ధమంటూ బాలినేని సవాల్ విసిరారు. గడపగడప‌కు వైసీపీ కార్యక్రమంలో ఎన్ని కిలో మీటర్లు తిరిగామన్నది ముఖ్యం కాదు.. ప్రతీ గడప సమస్యలను విని వారికి పరిష్కారం చేయడమే తన ధ్యేయమని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు