CM Shivraj Singh Chouhan : ఏపీ వలంటీర్ వ్యవస్థ, సీఎం కేసీఆర్‌పైనా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ల్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Shivraj Singh Chouhan : ఏపీ వలంటీర్ వ్యవస్థ, సీఎం కేసీఆర్‌పైనా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

MP CM Shivraj Singh Chouhan

Madhuya Praedes CM Shivraj Singh Chouhan : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ల్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో అవినీతి గురించి మాట్లాడే ముందు తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి చూసుకోవాలని అంటూ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో బీఆర్ఎస్ పోటీ చేస్తే స్వాగతిస్తామని అన్నారు. కేసీఆర్ విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని..దేశంలోనే అవినీతికి తెలంగాణ కేరాఫ్ అయిందని ఆరోపించారు.

భోపాల్ లో అధికారిక నివాసంలో మీడియా సమావేశంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ వలంటీర్ వ్యవస్థపై కూడా మాట్లాడారు. ‘‘పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ పదవులు ఇస్తే వారు పార్టీ కోసమే పనిచేస్తారని అన్నారు. దానివల్ల అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పారదర్శక విధానంలో పెన్షన్ అందించడమే మంచిదని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు.

Minister Smriti Irani : స్మృతి ఇరానీ స్నేహితురాలి భర్తను పెళ్లి చేసుకున్నారా..? మంత్రి ఘాటు రిప్లై

రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న ‘ముఖ్యమంత్రి లాడ్లీ లక్ష్మి’ పథకంలో మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. 21 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు తాము నెలకు రూ. 1000 ఇస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బును మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆ డబ్బుతో చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నారని..కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ పథకం కింద ఇస్తున్న సొమ్మును దశల వారీగా రూ. 3 వేలకు పెంచుతామని తెలిపారు.