raghurama krishnam raju mp
Raghurama Krishnamraju : ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎట్టకేలకు తన సొంత ప్రాంతానికి వచ్చేశారు. నాలుగేళ్లుగా సొంత ప్రాంతానికి దూరంగా ఉన్న ఆయన శనివారం ఉదయం రాజమండ్రి విమానాశ్రయంకు చేరుకున్నాడు. విమానాశ్రయం వద్ద రఘురామ కృష్టంరాజుకు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ర్యాలీగా భీమవరంకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల తరువాత సొంత ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మాటల్లో చెప్పలేనంత అనుభూతి. నేను జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ అందించిన సహకారం జీవితంలో మరవలేను. అభిమానులు, తెలుగుదేశం, జనసేన నాయకులు చూపిన ప్రేమ, ఆదరణ నా జీవితంలో మరవలేను అని రఘురామ కృష్ణం రాజు అన్నారు.
Also Read : తిరుపతి నుంచి చిరంజీవి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం.. చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సొంతవారు ఎవరో, పరాయి వారు ఎవరో అర్థమవుతోంది. మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మా ఊరు రాలేదు. నేను రాకుండా చాలా ప్రయత్నించారు. కోర్టు రక్షణతో వచ్చాను. పోలీసులు కూడా చాలా సహకరించారు. అర్హత ఉన్నా లేకపోయినా ధన్యవాదాలు అంటూ రఘురామ చెప్పారు.
Also Read : ఎవరీ ధ్రువ్ జురెల్..? అతని ప్రతిఅడుగులోనూ అమ్మ మద్దతు.. వద్దన్న తండ్రినీ మెప్పించిన యువ కెరటం
నియోజకవర్గం ఇన్నాళ్లకు గుర్తుకువచ్చిందా?
రఘురామ కృష్ణంరాజుపై మాజీ మంత్రి రంగనాథరాజు విమర్శలు గుప్పించారు. నాలుగు సంవత్సరాల తర్వాత నియోజకవర్గం గుర్తుకువచ్చిందా? అంటూ ప్రశ్నించాడు. ఆయన పార్టీకి రాజీనామా చేస్తాను అంటున్నాడు, ఇప్పటి వరకు ఆయన వైసీపీలో వున్నాడా? రఘురామ కృష్ణంరాజు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని తిట్టడం ఆయనకు అలవాటే. టీడీపీ, జనసేనకు రఘురామ కృష్ణంరాజు వస్తాడని వాళ్ళుచంకలు గుద్దుకుంటున్నారు. రఘురామ కృష్ణంరాజు వైసీపీలో ఉన్నా ఉపయోగం లేదు. ఏ పార్టీలో చేరిన నాలుగు రోజుల తర్వాత సొంత పార్టీనే తిట్టడం ఆయనకు ఆనవాయితీ. రఘురామ కృష్ణంరాజుపై నేను చేసిన వ్యాఖ్యలు పచ్చి నిజం….రాసుకోండి అంటూ రంగనాథ రాజు అన్నారు.