We will contest all seats from Andhra Pradesh, Says KA Paul
KA Paul Comments : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ అన్నారు. శనివారం (మార్చి 9న) బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాబు మోహన్ , కేఏ పాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తామన్నారు. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తానన్న కేఏ పాల్.. వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయనున్నారని వెల్లడించారు.
Read Also : Babu Mohan : బీజేపీకి మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ రాజీనామా..
అందుకే పాల్ పార్టీలో చేరాను : బాబు మోహన్
అనంతరం బాబు మోహన్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం వచ్చినాక దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని, బీజేపీ గత ఐదు సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయించుకుందని విమర్శించారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్న లక్ష్మణ్ లిస్టులో తన పేరు లేకుండానే కేంద్రానికి పంపారని చెప్పారు.
దేశం బాగుపడలని నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న కేఏ పాల్‌తో కలసి పనిచేయాలని ప్రజాశాంతి పార్టీలో చేరినట్టు బాబుమోహన్ తెలిపారు. కేఏ పాల్ నేతృత్వంలో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి పాల్ సేవలు దేశానికి, రాష్ట్రానికి అందే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Read Also : Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్.. అక్కడి నుంచి పోటీ