రాజధాని ప్రాంతంలోని రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి బోత్స. రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని వెల్లడించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం విశాఖపట్టణానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించడం జరిగిందని వెల్లడించారు.
అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. దుర్భాషలాడుతూ..టీడీపీ సభను సజావుగా జరగనివ్వడం లేదని విమర్శించారు. గతంలో పాలించిన టీడీపీ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని తెలిపారు. మహిళలు, బాలికల రక్షణ కోసమే దిశ యాక్టు తీసుకరావడం జరిగిందని వెల్లడించారు. విశాఖ మెట్రో రెండు ఫేస్‌లుగా చేయాలని నిర్ణయించామన్నారు.
* వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్మాణం కొనసాగుతుందా ? లేదా ? అనే ప్రచారం జరిగింది.
* రాజధానిని తరలించడం లేదని మంత్రి బోత్స సత్యానారయణ ఏపీ శాసనమండలిలో 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు.
* గతంలో అమరావతి నిర్మాణంపై మంత్రి బోత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
* దీనిపై ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* రాజధాని నిర్మాణ పనులను కొనసాగించాలని ఇటీవలే సీఎం జగన్ ఆదేశించారు.
Read More : 12 ఏళ్ల తర్వాత : ఆయేషా మీరా రీ పోస్టుమార్టం కంప్లీట్