Weather Forecast For Andhra Telangana
Weather Forecast : బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం…. సముద్ర మట్టానికి సుమారు 5.8 కి.మీ. ఎత్తులో ఈరోజు మధ్య అండమాన్ సముద్ర ప్రాంతాలలో కొనసాగుతున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 15 వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం వుంది.
తదుపరి ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తూర్పు-మధ్య మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా పయనిస్తూ ఈ నెల 17న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఇది ఈ నెల 18న దక్షిణ ఆంద్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
నిన్న తమిళనాడు ఉత్తర తీరం వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ఆంద్రప్రదేశ్, ఒడిశా మీదుగా గాంగ్ టక్, పశ్చిమ బెంగాల్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడింది.
కాగా……తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం తూర్పు వైపు నుంచి శీతర గాలులు వస్తున్నాయి. ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి అక్కడ అక్కడ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో
ఈ నెల 17 వ తేదీన ఏపీకి తుఫాను తాకనున్న కారణంగా మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. పూడిమడక సముద్ర తీరంవద్ద మత్స్యకారులకు తుఫాను విషయమై అధికారులు దండోరావేయించారు. రాగల 5రోజులూ తీరప్రాంతంలో మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలపటచంతో అచ్యుతాపురం పోలీసులు అప్రమత్తమై సమీపంలోని సముద్ర తీర గ్రామాల్లో చాటింపు వేయించారు.