Weather Update : ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలో పిడుగులతో ఆకస్మిక వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వానల ముప్పు!
Weather Update : ఏపీలో బుధవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు, చెదురుమదురు జల్లులు పడనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Sreehari A
- Published on- September 8, 2026 / 07:07 PM IST
AP Weather Update
- ఏపీలో బుధవారం పలు జిల్లాలకు వర్ష సూచన
- తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి
- పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్రపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం
- వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం
Weather Update : తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. వర్షం ముంచుకువస్తోంది. ఏ క్షణమైనా వర్షాలు పడొచ్చు. ఏపీలో బుధవారం (సెప్టెంబర్ 9) పలు జిల్లాలకు వర్షం సూచన కనిపిస్తోంది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం విస్తరించగా వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఏపీ (Weather Update) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉత్తరాంధ్రలో వర్ష ప్రభావం మరింత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Also : Telangana Assembly : తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డికి షాక్.. మండలి నుంచి సస్పెన్షన్.. ఎప్పటివరకంటే?
అదే సమయంలో అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడే పరిస్థితులు ఉన్నాయి.
పిడుగులతో తేలికిపాటి వర్షాలు :
దక్షిణ కోస్తా వైపు చూస్తే.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక రాయలసీమలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 52.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా పెరికగూడెంలో 31.3 మి.మీ., పెంటపాడులో 27.6 మి.మీ. వర్షం కురిసింది. చందర్లపాడు, పండ్రపాడులో 24 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
ఆకస్మిక వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ప్రజలెవరూ చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తెలంగాణ నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం ఏపీపై కూడా కనిపిస్తోంది. బుధవారం ఆకాశం ఎప్పుడు మేఘావృతమవుతుందో, ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి.
