Wedding Season: మోగనున్న పెళ్లి బాజాలు.. మూడు నెలల్లో మంచి ముహూర్తాల తేదీలు ఇవే..

తెలంగాణ, ఏపీలో పెళ్లిళ్ల సందడి ఇక జోరందుకోనుంది.

Wedding Season

Wedding Season: వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. అందుకే అందరూ మెచ్చుకునేలా, పది కాలాలూ గుర్తుండిపోయేలా వైభవంగా పెండ్లి వేడుకను జరుపుకుంటారు. ముహూర్తాలు ముంచుకొస్తున్న వేళ పెండ్లి పీటలెక్కేందుకు కొత్త జంటలు సిద్ధమవుతున్నారు. ఆషాఢం వచ్చేస్తుండటంతో ఆలోపే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో ఉన్న కొద్దిపాటి ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేసేందుకు పెద్దలు నిర్ణయం తీసుకుంటున్నారు. ఫలితంగా తెలంగాణ, ఏపీలో పెళ్లిళ్ల సందడి ఇక జోరందుకోనుంది.

 

ఏప్రిల్ 12వ తేదీ నుంచే శుభ ముహూర్తాలు మొదలయ్యాయి. మూడు నెలలు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలా అని ఎక్కువ రోజులు వివాహ ముహూర్తాలు లేవు. ఏప్రిల్ నెలలో 20, 23, 30 తేదీల్లోనే ముహూర్తాలు మిగిలి ఉన్నాయి. మే నెలలో 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పదమూడు రోజులే మంచి ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత జూన్ నెలలో కేవలం నాలుగు రోజులు మాత్రమే శుభ ముహూర్తాలు ఉన్నాయి. తరువాత వచ్చేది ఆషాఢమాసం కావడంతో పెళ్లిళ్ల ముచ్చటే ఉండదు.

 

జులైలో 26 నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు కొన్ని మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు – సెప్టెంబర్ నెలల్లో శూన్య మాసం ఉండటంతో సెప్టెంబరు 22వ తేదీ నుంచి కొన్నే మంచిరోజులు ఉన్నాయి. తరువాత నవంబరు 20న, ఆ తరువాత కొన్నిరోజులే పెళిళ్లకు అనువైన ముహూర్తాలు ఉన్నాయి. దీంతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వారు ఈ మూడు నెలల్లోనే పెళ్లి తంతును పూర్తిచేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్‌ 30న బుధవారంతో కూడిన అక్షయ తృతీయ రావడంతో కొన్ని వేల సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు కుదుర్చుకున్నారు. ఆ రోజు పెళ్లి మండపాలు కూడా దొరకని పరిస్థితి ఉన్నట్లు సమాచారం.

 

ముహూర్తాలు ఇలా..
ఏప్రిల్‌ నెలలో : 16, 18, 20, 21, 23, 30
మే నెలలో: 1, 7, 8, 9, 10, 11, 14, 17, 18, 21, 22, 23, 28
జూన్ నెలలో ‌: 4, 5, 6, 7, 8