వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు.. చాలా శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది?

కార్యకర్తల అసంతృప్తిని గ్రహించిన నారా లోకేశ్‌ స్వయంగా ఈ వ్యవహారాలన్నీ తానే మానిటరింగ్ చేస్తున్నారట.

కూటమి ప్రభుత్వం వచ్చింది. అంతా సెట్‌ అయిపోతుందని అనుకున్నారట తెలుగు తమ్ముళ్లు. కానీ నవ్యాంధ్రలో కూటమి సర్కార్ ఏర్పడి 7నెలలు అయినా..ఇంకా వ్యవస్థలను గాడిలో పెట్టలేదని వాపోతున్నారట. సీఎం చంద్రబాబు లేకపోతే మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి వెళ్తే తప్ప మంత్రులు తమ శాఖల్లో ప్రక్షాళనపై దృష్టి పెట్టట్లేదట. నిబంధనలకు విరుద్ధుంగా..వైసీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో వివిధ శాఖల్లో తిష్ట వేసిన వైసీపీ సానుభూతిపరులు ఇప్పటికీ ఆ పార్టీ కోసమే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ క్యాడర్.

జగన్‌ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల నుంచి ఫోన్ వస్తే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారట. వాట్సాప్ మెసేజ్‌లతోనే పోస్టులు సర్ధుబాటు చేసేశారట. చాలామందికి నియామక పత్రాలు లేకున్నా లక్షల్లో ప్రజాధనం జీతాల రూపంలో కట్టబెట్టేశారన్న అలిగేషన్స్ ఉన్నాయి. గత ఐదేళ్లలో వివిధ శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన సిబ్బందిపై టీడీపీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7నెలలు అయినా ఇంతవరకూ దిద్దుబాటు చర్యలు లేవట.

ఫ్యాన్ పార్టీ సానుభూతి పరులను గుర్తిస్తారా?
అన్ని శాఖల్లోనూ పాతుకుపోయిన వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వాపోతున్నారు. సదరు ఫ్యాన్ పార్టీ సానుభూతి పరులను గుర్తించి చర్యలు తీసుకోవటంలో ఆయా శాఖల మంత్రులు విఫలమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మనకెందుకులే ఈ వ్యవహారం అనే ధోరణిలో ప్రజా ప్రతినిధులు ఉండటంపై టీడీపీ క్యాడర్‌లో అసంతృప్తికి దారి తీస్తోంది.

రెడ్ బుక్ వ్యవహారంపై కూడా చంద్రబాబు, లోకేశ్‌ దృష్టికి వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుందట. లేకపోతే వేరే ఎవరూ పట్టించుకోవడం లేదట. ఇలాంటి వ్యవహారాల్లో మంత్రుల నుంచి వస్తున్న స్పందనపై నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అంశాలు లోకేశ్‌, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదని..అందుకే సోషల్‌ మీడియానే నమ్ముకుంటున్నారట క్యాడర్. నిరంతరం సోషల్ మీడియా ఫాలో అయ్యే లోకేశ్‌కు ట్యాగ్‌ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్‌ ఉందో వివరిస్తున్నారట. వీలైతే లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లే నేతలకు కూడా ఇష్యూస్ చెబుతున్నారట.

ఏపీలో డిజిటల్ కార్పొరేషన్ వ్యవహారంలో చోటు చేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి ప్రజాధనంతో జీతాలు ఇచ్చారని కూటమి నేతలు చెబుతున్నారు. అంతటితో ఆగకుండా గత ఐదేళ్లలో సోషల్ మీడియా ద్వారా విపక్ష నేతలపై పోస్టులు చేసిన చాలామంది డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు తీసుకున్నట్లు ఆధారాలు చూపిస్తున్నారు టీడీపీ క్యాడర్. సమర్థవంతమైన ఉద్యోగం ఏమీ చేయకపోయినా..వైసీపీకి అనుకూలంగా, టీడీపీ, జనసేన నేతలను కించపరుస్తూ పోస్టులు పెట్టనోళ్లకు డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జీతాలు అందాయని టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు.

సమాచార పౌర సంబంధాల శాఖలో కూడానా?
ఫైబర్ నెట్‌లో కూడా ఇదే విధంగా జరిగిందట. వేలాదిమంది వైసీపీ కార్యకర్తలకు, లక్షలాది రూపాయల జీతం ఇస్తూ ఉపాధి కల్పించారని ఆరోపించారు. సమాచార పౌర సంబంధాల శాఖలో కూడా చాలామంది వైసీపీ అనుకూలురు తిష్టవేశారని ఇప్పటికి వారిని తొలగించడం లేదని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు టీడీపీ నేతలు. కొందరు మంత్రులు తమ శాఖలను ప్రక్షాళన చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం లైట్‌ తీసుకుంటున్నారట.

కార్యకర్తల అసంతృప్తిని గ్రహించిన నారా లోకేశ్‌ స్వయంగా ఈ వ్యవహారాలన్నీ తానే మానిటరింగ్ చేస్తున్నారట. శాఖల వారీగా నివేదికలు తెప్పించుకొని ప్రక్షాళనకు స్టార్ట్ చేశారట. వైసీపీతో అంటకాగిన అధికారులను దూరంగా పెట్టాల్సిందేనని మంత్రులకు తేల్చి చెప్పాటర లోకేశ్. ప్రస్తుతానికి ఫైబర్ నెట్, డిజిటల్ కార్పొరేషన్, కొన్ని ఇతర శాఖలను ప్రక్షాళన చేస్తున్నారట. మిగిలిన శాఖలను కూడా త్వరలోనే సెట్ చేస్తామంటూ కార్యకర్తలు హామీ ఇస్తున్నారు లోకేశ్‌. టీడీపీ క్యాడర్ ఆశించినట్లు వైసీపీతో అంటకాగిన నేతలందరినీ తప్పిస్తారా లేరా అన్నది వేచి చూడాలి మరి.

Cm Revanth Singapore Tour : సింగపూర్ టూర్ లో తొలిరోజు సీఎం రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ