10 నిమిషాల వర్షానికే నదుల్లా కాలనీలు.. బెజవాడ మునిగింది అందుకేనా? ఇక్కడా బుల్డోజర్ దిగాల్సిందేనా?

అరగంట వర్షం కాలనీలను ముంచడానికి రీజన్ ఏంటి? నీళ్లు పోవడానికి దారి లేకపోవడమే నష్టానికి కారణమా?

Vijayawada Floods : చిన్న వర్షం.. అంతా అతలాకుతలం.. కాలనీలు చెరువులను తలపించడానికి వీధులు నదుల్లా మారడానికి రోజులు తరబడో లేక రోజంతా వర్షం పడాల్సిన అవసరం లేదు. అరగంట సేపు మోస్తరు వాన పడితే చాలు.. కాలనీకి కాలనీలే నీట మునిగిపోతున్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. 10, 20 నిమిషాల వర్షానికే జనం ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండటం లేదు.

కార్లు, టూవీలర్లు నీట మునిగిపోతున్నాయి. ఒక్కోసారి వర్షం ఎఫెక్ట్ చూస్తే ఇలా 20 నిమిషాల్లో ఇంత విధ్వంసం జరిగిందా? అన్న ఫీలింగ్ కలుగుతోంది. నిజంగానే రెయిన్ ఎఫెక్ట్ అంత తీవ్రంగా ఉంటుందా? అరగంట వర్షం కాలనీలను ముంచడానికి రీజన్ ఏంటి? నీళ్లు పోవడానికి దారి లేకపోవడమే నష్టానికి కారణమా?

నవ్యాంధ్ర రాజధానికి కేరాఫ్ ఆ సిటీ. ఆ నగరం అంటే ఏపీ ప్రజలకు ఓ వైబ్రేషన్. హైదరాబాద్ తర్వాత అందరికీ గుర్తొచ్చేది విజయవాడే. అలాంటి బెజవాడ అష్టదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఆ నగరం మీదుగా వెళ్లే నేషనల్ హైవేనే మునిగిపోయింది. ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్ అయ్యాయి. 3 లక్షల మంది ఇల్లు విడిచి వెళ్లారు.

బుడమేరు బుస కొట్టడంతో విజయవాడ విలవిలలాడుతోంది. అనుకోని విలయం నగరవాసులను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసింది. అసలు బెజవాడ ఎందుకు మునిగింది? కాలనీకి కాలనీలే వరద నీటిలో చిక్కడానికి కారణం ఏంటి? జనమే కొని మరీ కష్టం తెచ్చుకున్నారా?

 

Also Read : విజయవాడ ముంపునకు ప్రధాన కారణం ఏంటి? ఈ పాపం ఎవరిది?

ట్రెండింగ్ వార్తలు