Kesineni Nani : పార్టీని కవ్వించేలా ప్రకటనలు, తమ్ముళ్లను ఇబ్బంది పెట్టేలా అడుగులు.. అంతుచిక్కని కేశినేని నాని వ్యూహం, విజయవాడ టీడీపీలో అసలేం జరుగుతోంది?

ఎంపీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు పైకి మాత్రం ఎలాంటి విమర్శలూ చేయడం లేదు. Kesineni Nani - TDP

Kesineni Nani - TDP

Kesineni Nani – TDP : ఎంపీ టికెట్ నాకు, ఎమ్మెల్యే టికెట్ నీకు.. నేను చెప్పాను కాబట్టే విజయవాడలో లోకేశ్ పాదయాత్ర సక్సెస్ అయ్యింది. నేను లేకపోతే పార్టీనే లేదు. ఇదీ బెజవాడ ఎంపీ కేశినేని నాని తీరు. విజయవాడ వరకు ఆయనే హైకమాండ్ లా ప్రవర్తిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు షాక్ తింటున్నారు. అధిష్టానానికే మైంబ్ బ్లాంక్ అయ్యే విధంగా ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించేస్తున్నారు ఎంపీ కేశినేని నాని.

కొన్నాళ్లుగా పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్న నాని.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని చెప్పుకోవడమే కాదు.. తన అనుచరులు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో కూడా చెబుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. నాని వైఖరి ఏంటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు బెజవాడ లీడర్లు. ఇంతకీ విజయవాడ టీడీపీలో ఏం జరుగుతోంది?

Also Read..Minister Roja : రెండు ఎకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు : మంత్రి రోజా

టీడీపీ ముగ్గురు ఎంపీల్లో ఒకరు. వరుసగా రెండుసార్లు గెలిచిన నేత. ఆయనే కేశినేని నాని. పార్టీలో తిరుగులేని నేతగా చక్రం తిప్పిన కేశినేని నేని కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ఢిల్లీలో అధినేత చంద్రబాబు పక్కక కనిపిస్తూ టీడీపీలో ఉనికి చాటుకుంటున్నారు. కానీ, రాష్ట్రంలో పార్టీ పిలుపునిచ్చే ఏ కార్యక్రమం కూడా చేయరు. సొంత నియోజకవర్గంలోనూ పార్టీ వ్యవహారాలకు పరిమితంగానే హాజరవుతున్నారు.

అంతెందుకు పార్టీ యువ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ముఖం చాటేశారు కేశినేని నాని. తన సొంత సోదరుడు కేశినేని చిన్ని ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉండటం ఇష్టం లేని ఎంపీ నాని బెజవాడ లీడర్లలో సీనియర్లతో గ్యాప్ మెయింటేన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తనకు వ్యతిరేకంగా సోదరుడు చిన్నిని బెజవాడ సీటుకు పోటీ తెచ్చారని రగిలిపోతున్న ఎంపీ నాని పార్టీలో తన ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేలా అడుగులు వేస్తున్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత బుద్ధా వెంకన్న పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఈ సీటుపై గురి పెట్టిన బుద్దా అక్కడ చాప కింద నీరులా కార్యకర్తలతో అల్లుకుపోతున్నారు. అయితే, వెంకన్నకు చెక్ చెప్పాలని భావిస్తున్నా ఎంపీ నాని ఆ సీటు నుంచి తన అనుచరుడు ఎంఎస్ బేగ్ పోటీ చేస్తారని ప్రకటించేశారు.

టీడీపీ సంప్రదాయానికి భిన్నంగా టికెట్ల కేటాయింపుపై ఎంపీ ప్రకటన చేయడంతో షాక్ తిన్నారు సీనియర్ నేతలు. అయితే, ఎంపీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు పైకి మాత్రం ఎలాంటి విమర్శలూ చేయడం లేదు. ఎంపీ ఏమన్నా చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నట్లు నటిస్తున్నారు. అంతర్గతంగా మాత్రం ఎంపీ నానిని కట్టడి చేయాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీడీపీ అధిష్టానం కూడా నాని తీరుని ఓ కంట కనిపెడుతోందని చెబుతున్నారు. కానీ, ఎంపీపై ఈ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని, సమయం కోసం వేచి చూస్తున్నట్లు చెబుతున్నారు. ఎంపీ నానిని మరెవరో డైరెక్ట్ చేస్తున్నట్లు అనుమానిస్తోంది తెలుగుదేశం పార్టీ. పార్టీ లైన్ దాటుతూ తనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీ నాని వ్యూహాత్మకంగా కవ్విస్తున్నారని అనుమానిస్తోంది టీడీపీ నాయకత్వం. అందుకే ఎంపీ నాని ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రతి స్పందించవద్దని కార్యకర్తలను, ఇతర నేతలను కట్టడి చేస్తోందని చెబుతున్నారు.

Also Read..Anil Kumar : దుబాయ్ లో చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు.. అమరావతి అనేది పెద్ద భూ దందా : అనిల్ కుమార్

టామ్ అండ్ జెర్రీ పోరాటంలా ప్రస్తుతానికి టీడీపీ, ఎంపీ కేశినేని మధ్య పోరాటం జరుగుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ పోరాటంలో మరింత జోరు కనిపించే అవకాశం ఉందంటున్నారు. ఎంపీ నాని వ్యవహారశైలిని పట్టించుకోనట్లు నటిస్తూనే పార్టీ ఒక కంట కనిపెడుతోందని, సమయం చూసి యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు పరిశీలకులు.