ఓట్లు చీలిపోవద్దని, బీజేపీ గెలిచే పరిస్థితి ఏర్పడాలనే భావనతో జనసేనను గ్రేటర్ బరి నుంచి తప్పిస్తున్నట్లుగా ప్రకటించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అంతుకాదు.. జనసేన తరపున పోటీ చేసేందుకు నామినేషన్లు వేసినా కూడా వెంటనే వెనక్కి తీసుకుని బీజేపీకి బేషరతుగా సపోర్ట్ చేసేయాలనేది పవన్ కళ్యాణ్ జనసైనికులకు అంటే ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చిన పిలుపు. ఇంతవరకు ఓకే కానీ, ఇప్పుడు ఒక్కసారిగా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల హీట్ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ సడెన్‌గా ఢిల్లీకి వెళ్లారు
అయితే పవన్ కళ్యాణ్ హస్తినకు ఎందుకు వెళ్లారు. ఇది ఇప్పుడు తన పార్టీ వర్గాలనే కాదు.. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికీ కలుగుతున్న సందేహం. పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడం వెనుక రకరకాల కథనాలు వినిపిస్తూ.. ఉన్నాయి. అందులో ముఖ్యమైన రెండు విషయాల గురించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో ఒకటి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం. రెండవది తిరుపతి ఉపఎన్నికల్లో బరిలోకి జనసేన.
https://10tv.in/kcr-enter-in-national-politics/
2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన జనసేన.. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి దగ్గరైంది. రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించగా.. ఇప్పటివరకు కలిసి కార్యక్రమాలు నిర్వహించింది లేదు.. ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. ఈ క్రమంలోనే GHMC ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈ ఎన్నికలు తెలంగాణలో బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు కాగా.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జనసేనతో మంతనాలు తర్వాత బీజేపీ ఎన్నికల్లో ఆ పార్టీని తప్పించింది. దానిపై సొంత పార్టీలోనే కొన్ని విమర్శలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సీటును తమకు కేటాయించాలని కోరేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లినట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే జేపీ నడ్డాతో సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను గ్రేటర్‌లో ప్రచారం చెయ్యమని అడిగే అవకాశం కనిపిస్తుంది. తంలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బిజెపి ఓ మోస్తరు ఓట్లను సాధించింది. అయితే జనసేన మాత్రం 2019ఎన్నికల్లో సీటును పొత్తులో భాగంగా బీఎస్‌పీకి కేటాయించింది.
ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని ఉప ఎన్నికల బరిలో నిలపగా.. ఆ తర్వాత అధికార వైసీపీ కూడా గురుమూర్తిని బరిలోకి దింపాలని తీర్మానించింది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రెండు పార్టీలు కలిసి తిరుపతిలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ దీంతోపాటు ఢిల్లీలో వకీల్‌సాబ్ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొననున్నారు.