ఏపీ రాజధాని విషయంలో పవన్ స్టాండ్ ఏంటన్నదానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. 2019. డిసెంబర్ 30వ తేదీ సోమవారం జనసేన విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. ఇందులో ఈ అంశంపై చర్చించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి మూడు రాజధానులకు జై కొట్టిన సంగతి తెలిసిందే.
* జనసేన స్టాండ్ ఏంటి?
* జనసేన విస్తృతస్థాయి సమావేశం
* పవన్ కళ్యాణ్ ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు?
* మూడు రాజధానులకు అనుకూలమా, వ్యతిరేకమా?
* రాయలసీమలో హైకోర్టుకు పవన్ ఓకే చెప్తారా?
* సమర్థించినా, వ్యతిరేకించినా తలనొప్పులు తప్పవా?
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరగనుంది. కార్యాలయానికి ముఖ్య నేతలంతా రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దీంతో కేపిటల్ వార్ విషయంలో పవన్ ఏం చెయ్యబోతున్నారు అన్న ఆసక్తి నెలకొంది. పలు సందర్భాల్లో అమరావతిపై ఒక్కో విధంగా స్పందించారు. గతంలో చంద్రబాబుపై విమర్శలు చేసినప్పుడు అమరావతి పెద్ద కుంభకోణం అన్నారు. రాజధాని మొత్తం ఒకే ప్రాంతంలో ఉంటే అభివృద్ధి కష్టం అని పేర్కొన్నారు. తర్వాత మరో సందర్భంలో అమరావతిలోనే రాజధాని ఉండాలన్నారు. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమలు వెనకబడ్డాయని అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కావొద్దన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం రాయలసీమలో హైకోర్టు. ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుండటంతో.. దీంతో మూడు రాజధానుల విషయాన్ని వ్యతిరేకించినా లేక సమర్థించినా పవన్ కళ్యాణ్ కు తలనొప్పులు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు ఏపీలో మూడు రాజధానుల రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులను సీఎం జగన్ ప్రతిపాదించినప్పటి నుంచి అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. రాజధాని అమరావతిని మార్చొద్దని డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు.
ఇక మూడు రాజధానుల ప్రకటనపై ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలలో కనిపించలేదు. తాజాగా ఇప్పుడు మరోమారు ఆయన కార్యాచరణ రూపొందించబోతున్నారు. మరి మూడు రాజధానులకు జనసేన అనుకూలమా..? వ్యతిరేకమా?, పవన్ కల్యాణ్ ఏం చెప్పబోతున్నారు? అనేది కొద్ది గంటల్లో తేలబోతోంది.
Read More : కౌన్ బనేగా తెలంగాణ సీఎస్..అజయ్ మిశ్రా, సోమేశ్ కుమార్ !