టీడీపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే? సెంట్రల్ క్యాబినెట్‌లో టీడీపీకి ఎన్ని స్థానాలంటే..

వీరితో పాటు భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి పేర్లను కూడా టీడీపీ పరిశీలిస్తోంది.

Tdp In Central Cabinet : కేంద్ర కేబినెట్ లో టీడీపీకి 3 నుంచి 4 స్థానాలు దక్కనున్నాయి. సామాజిక సమీకరణాలు, సమర్ధత ఆధారంగా కేంద్ర కేబినెట్ లో పలువురు నేతలు చోటు దక్కించుకోనున్నారు. కేంద్ర కేబినెట్ రేసులో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. గతంలో వాజ్ పేయి హయాంలో ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పని చేశారు. ఎర్రన్నాయుడి మరణం తర్వాత వారసుడిగా వచ్చిన రామ్మోహన్ నాయుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎస్సీ వర్గానికి చెందిన వారిలో అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్ కేబినెట్ రేసులో ఉన్నారు. లోక్ సభ స్పీకర్ గా పని చేసిన దివంగత బాలయోగి తనయుడే హరీశ్ మాధుర్. మరో ఇద్దరు ఎస్సీ ఎంపీలు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ప్రసాదరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాయలసీమ నుంచి ప్రసాదరావుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. వీరితో పాటు భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి పేర్లను కూడా టీడీపీ పరిశీలిస్తోంది.

జనసేన పార్టీ నుంచి బాలశౌరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక బీజేపీ నుంచి పురంధేశ్వరి, సీఎం రమేశ్ పేర్లను పార్టీ హైకమాండ్ పరిశీలిస్తోంది.

Also Read : జగన్‌ను కలవాలంటే పడిగాపులే..! జక్కంపూడి రాజా వ్యాఖ్యలతో ఏకీభవిస్తా- కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు