అసెంబ్లీలో బోండా ఉమ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? పవన్‌ కల్యాణ్‌పై డైరెక్ట్‌ అటాక్‌..!

విజయవాడ పోలీసు కమిషనర్‌కు కూడా ఓ లెటర్ రాశారట బొండా ఉమా. హైకోర్టులో పిల్ కూడా వేశారట. దీంతో కాలుష్య నియంత్రణ మండలి..సదరు కంపెనీపై విచారణ చేయించి చర్యల తీసుకునేందుకు రెడీ అయిందట.

Bonda Uma: వైసీపీ ఎలాగూ అసెంబ్లీకి రావడం లేదు. కూటమి పార్టీలే అపోజిషన్. కూటమి పార్టీలే అధికార పక్షం అన్నట్లు నడుస్తోంది ఏపీ అసెంబ్లీ. అందుకు తగ్గట్లుగానే తమ సభ్యులతో సమస్యలను ప్రస్తావించి..వాటికి మంత్రులతో సమాధానం చెప్పిస్తోంది కూటమి సర్కార్. అయితే ఓ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నే కాస్త హాట్ టాపిక్ అయింది. ఆయన అనుకున్నదొకటి అయితే..అయింది ఇక్కోటి అన్నట్లుగా మారిపోయిందట.

అధికార పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమా..ఆల్ ఆఫ్ సడెన్‌గా ఏపీ అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యే రోల్‌ ప్లే చేసినట్లు కనిపించారు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్‌ను కార్నర్ చేస్తూ..పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో బొండా ఉమా వ్యాఖ్యలు, ఆరోపణలు కలకలం రేపాయి. దీంతో అసలు బొండా ఉమా అలా ఎందుకు మాట్లాడారు?

ఈ కేసు దీని నేపథ్యం ఏంటనే దానిపై అటు పవన్ ఆఫీస్, ఇటు సీఎంఓ కూడా ఆరా తీసిందట. అయితే ఏపీ అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్షపాత్ర పోషిస్తూ..ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుండటం చూస్తూనే ఉన్నామ్. ఇంత వరకు బానే ఉంది. కానీ సొంత సర్కార్‌ను ఇబ్బంది పెట్టడంతో పాటు తానే సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి ఆ ఎమ్మెల్యే వెళ్లిపోయారన్న టాక్ వినిపిస్తోంది.

Also Read: రూ.50 కోట్ల బ్లాక్‌మననీని వైట్‌గా మార్చాలని కోరిన అధికారి ఎవరు? కోరింది ఎవరిని? అధికారులపై సర్కార్ నిఘా?

బొండా ఉమా చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి సభ్యులను ఆశ్చర్యపరిచాయి. క్వశ్చన్ అవర్‌లో ప్లాస్టిక్‌ కాలుష్యంపై మాట్లాడిన బొండా..కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై పర్సనల్ అటాకింగ్‌కు దిగారు. పవన్ కల్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. పీసీబీ పని చేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదని..ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఛైర్మన్‌ దగ్గరకు వెళ్తే..డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారంటూ బొండా ఉమా చేసి చర్చకు దారి తీశాయి.

విషయమేంటని ఆరా తీసిన పవన్ కల్యాణ్‌ షాక్ అయ్యారట. పీసీబీ అధికారులు బొండా తీరును పవన్‌ కల్యాణ్‌కు వివరించినట్లు తెలుస్తోంది. క్రెబ్స్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ వ్యర్థాలను భారీగా జక్కంపూడి ఏరియాలో డంప్ చేస్తోందట. ఇందులో కొంత బొండా నియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్ పరిధిలోకి వస్తుంది. ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈ ఏడాది ఫిబ్రవరిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారట.

పోలీసు కమిషనర్‌కు లెటర్!

విజయవాడ పోలీసు కమిషనర్‌కు కూడా ఓ లెటర్ రాశారట బొండా ఉమా. హైకోర్టులో పిల్ కూడా వేశారట. దీంతో కాలుష్య నియంత్రణ మండలి..సదరు కంపెనీపై విచారణ చేయించి చర్యల తీసుకునేందుకు రెడీ అయిందట. అయితే యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేసిన బొండానే..ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారట. ఇదే విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు డిప్యూటీ సీఎం పవన్‌కు వివరించారట.

ఇంకోవైపు..అసెంబ్లీలో ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలు, క్రెబ్స్ ఇండస్ట్రీస్ వ్యవహారంలో ఎమ్యెల్యే జోక్యం..ఈ మొత్తం అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలుస్తోంది. సీఎంవో అధికారులు పీసీబీ నుంచి వివరాలు తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అటు పవన్ సీరియస్ అవడం..ఇటు సీఎంవో ఆరా తీయడం అంతా చకచకా జరిగిపోయింది.

మొత్తం మీద ఏదో హడావుడి చేద్దామనుకుంటే బొండానే అడ్డంగా బుక్కయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు కెమికల్ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేసి..ఇప్పడెందుకు వద్దంటున్నారన్న చర్చ జరుగుతోంది. సభావేదికగా ఇష్యూను రేజ్ చేసిన ఉమా..ఇప్పుడు సైలెంట్ అయిపోవడం వెనక జరిగిందేటన్న చర్చ నడుస్తోంది.