×
Ad

కీలక సమయాల్లో పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా మౌనం.. ఎందుకంటే?

దీనంతటికి కారణం చంద్రబాబు, పవన్ మధ్య ఉన్న కోఆర్డినేషనే అన్న చర్చ జరుగుతోంది. జనసేన రియాక్ట్ కాకపోవడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి.

Pawan Kalyan: ఏపీ పాలిటిక్స్‌ అంటేనే హైవోల్టేజ్ హీట్. ఏ చిన్న మ్యాటర్ అయినా అధికార విపక్షాలు పోటీ మరీ అస్త్రంగా మల్చుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఓ ఇష్యూ వైసీపీకి చాలా అడ్వాంటేజ్‌గా మారిందన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్‌ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

వైసీపీ వీటిని అస్త్రంగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై దాడికి దిగుతోంది. జగన్‌ చిరును ఇన్సల్ట్ చేశారన్నట్లుగా బాలయ్య మాట్లాడితే..తనను సాదరంగా ఆహ్వానించి మర్యాద ఇచ్చారని మెగాస్టార్ చెబుతున్నారు. దీంతో అప్పుడు కూటమి నేతలు, పవన్, పలువురు సినీ ప్రముఖులు చేసిన ఆరోపణలకు ఇప్పుడేం ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తోంది వైసీపీ. మెగా ఫ్యాన్స్‌..బాలకృష్ణ తీరు తీవ్రంగా తప్పుబడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో పవన్‌ కల్యాణ్‌, ఇటీవలే ఎమ్మెల్సీ అయిన మెగా బద్రర్‌ నాగబాబు ఇద్దరూ స్పందించకపోవడం పెద్ద విషయంగా మారింది.

Also Read: అధికార కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతోన్న స్థానిక పోరు.. జంపింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా

అయితే కూటమిలో భాగంగా ఉన్న పవన్‌ ఏ ఇష్యూలో తొందరపడి రియాక్ట్ కావడం లేదు. పైగా ఏదైనా వివాదాస్పద అంశం తెరమీదకు రాగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇద్దరు మాట్లాడుకుని ఓ అండర్‌ స్టాండింగ్‌కు వస్తున్నారట. అప్పుడు వాళ్లు స్పందించాలనుకుంటే స్పందిస్తున్నారట. లేకపోతే ఆ అంశాన్ని పట్టించుకోకుండా సైలెంట్‌గా ఉండిపోతున్నారట. ఇది కూటమికి చాలా మేలు చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

ప్రత్యేకంగా వైసీపీ ఎంత రెచ్చగొట్టేలా చేస్తున్న పవన్ కల్యాణ్ సంయమనం కూటమి ప్లస్‌ పాయింట్‌గా మారుతుందట. ఎందుకంటే కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది పవనే. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెప్తుంటారు. బీజేపీ పెద్దలను ఒప్పించి మెప్పించి..కూటమిని ఫామ్‌ చేసి తలపడి నిలబడి ఎన్నికల్లో గెలిచి చూపించారు పవన్. దీంతో ఆయనను కూటమికి దూరం చేస్తే తిరిగి తాము అధికారంలోకి రావడం ఈజీ అవుతుందని వైసీపీ లెక్కలు వేసుకోవడంలో తప్పులేదు. కానీ వైసీపీ ట్రాప్‌లో పవన్‌ పడకపోవడమే కీలకమైన విషయం. చివరకు తన అన్నయ్యను వివాదంలోకి లాగి బాలయ్య కామెంట్స్ చేసినా పవన్‌ స్ట్రాటజిక్‌గా సైలెంట్‌గా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.

నాగబాబు కూడా సైలెంట్‌
అయితే తన సోదరులను ఎవరైనా ఏమైనా అంటే ఒంటికాలిపై లేచే నాగబాబు కూడా బాలయ్య ఇష్యూలో సైలెంట్‌గా ఉన్నారు. తన సోదరులను ఎవరైనా ఏమైనా అంటే..అయితే డైరెక్ట్‌గానో లేకపోతే సోషల్‌ మీడియాలో ఇండైరెక్ట్‌గానో రియాక్ట్ అవుతుంటారు నాగాబాబు. గత ఎన్నికల ముందు తమ కుటుంబ సభ్యుడైన అల్లుఅర్జున్‌ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని సోషల్‌ మీడియా పోస్ట్‌తో ఏకి పారేశారు. తనవాడు..పరాయివాడు అంటూ గట్టిగా స్పందించారు నాగబాబు. కానీ ఇప్పుడు మాత్రం ఆగ్రహం స్థానంలో సమన్వయం పాటిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరూ? అన్నట్లుగా నాగబాబు మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పడు బాలయ్య కామెంట్స్‌పై నాగాబాబు స్పందించకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబోయే మంత్రిగానూ ప్రచారంలో ఉన్న నాగాబాబు బాలయ్య వ్యాఖ్యల దుమారంపై ఏం మాట్లాడుతారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆయన సోషల్‌ మీడియా పోస్ట్‌ కానీ, ప్రకటన కానీ ఇవ్వలేదు.

దీనంతటికి కారణం చంద్రబాబు, పవన్ మధ్య ఉన్న కోఆర్డినేషనే అన్న చర్చ జరుగుతోంది. జనసేన రియాక్ట్ కాకపోవడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. బాలయ్య వ్యాఖ్యలు నొప్పించినా..పవన్, నాగాబాబు స్పందించకుండా ఉండటమే బెటర్ అన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ చిరు కామెంట్స్‌ను అడ్వాంటేజ్‌గా మల్చుకుంటున్న టైమ్‌లో రియాక్ట్ కాకపోవడమే కూటమికి మేలని గ్రహించి..పవన్‌, నాగబాబు సైలెంట్‌గా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే బాలయ్య కామెంట్స్‌పై అటు పవన్..ఇటు నాగబాబు స్పందిచకుండా ఉండిపోయారని..వివాదం సద్దుమణిగాకో ఎప్పుడో ఓసారి రెస్పాండ్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది.