అక్రమ సంబంధాల మోజులో కాపురాలు కూలగొట్టుకుంటున్న కుటుంబాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. కట్టుకున్న వాడితో హాయిగా కాపురం చేసుకోక మరోకరిపై మోజుతో వివాహాన్ని విఛ్చినం చేసుకుంటున్నారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
అన్నదమ్ముల్లో తమ్ముడ్ని పెళ్లి చేసుకుని అన్నపై మోజు పెంచుకుంది. బావతో వివాహేతర సంబంధం పెట్టుకుని… అతనితో కలిసి, తాళి కట్టిన భర్తనే హత్య చేసింది ఆ ఇల్లాలు. మానవ విలువలను మంటగలిపే ఈ ఘటన మంగళగిరి మండలం, నవులూరు గ్రామం, ఉడా కాలనీలో చోటు చేసుకుంది.
గుర్తు తెలియని మృతదేహం
ఆగస్ట్ 26వ తేదీన నవులూరు మండలం ఉడాకాలనీలోని క్రికెట్ స్టేడియం వెనుక ముళ్ళపొదల్లో గుర్తు తెలియని మృతదేహాన్నిగుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.
మృతదేహాం సమీపంలో దొరికిన ఆధారా కార్డ్ ఆధారంగా మృతుడ్ని సీతారమాంజనేయులుగా గుర్తించారు. ఈక్రమంలో మృతుడి భార్య లక్ష్మి, సోదరుడు దుర్గా ప్రసన్నలను విచారించారు.
మృతుడి భార్య లక్ష్మికి, మృతుడి అన్న దుర్గాప్రసన్న మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే బావ, అతని స్నేహితులతో కలిసి భార్య లక్ష్మి హత్య చేసి ఉరివేసుకున్నట్లు సృష్టించిన విషయాన్ని ఒప్పుకుంది.
బావతో అక్రమ సంబంధం
మంగళగిరి దగ్గర్లోని నవులూరులో సీతారామాంజనేయులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లైన కొన్నాళ్లకే లక్ష్మి… సీతారామాంజనేయులు అన్న దుర్గా ప్రసన్నపై మోజు పడింది. దీంతో వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.
రామాంజనేయులు ఆటో నడుపుకోటానికి వెళ్లగానే బావ,మరదళ్ళు గుట్టుగా శృంగారం జరుపుతూ ఎంజాయ్ చేయసాగారు. వీరి అక్రమ సంబంధం ఒకరోజు రామాంజనేయులుకు తెలిసిపోయింది. విషయం తెలిసిన రామాంజనేయులు భార్యను నిలదీశాడు. అన్నతో గొడవ పడ్డాడు.
ఈ విషయమై ఇటీవల రెండు కుటుంబాల్లోనూ తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇక తమ రంకు బయట పడటంతో బావా, మరదలు ఇద్దరూ కల్సి రామాంజనేయులును హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నేర చరిత్ర ఉన్న దుర్గా ప్రసన్న తమ్ముడ్ని అడ్డు తొలగించుకోటానికి పధకం రచించాడు.
తమ్ముడి హత్య
ఆగస్ట్ 21వ తేదీ రాత్రి సమయంలో దుర్గా ప్రసన్న మిత్రులు తోడేటి నాగరాజు, పసుపులేటి హరికృష్ణ, లక్ష్మి ఓచోట కలిసారు. తమ్ముడు రామాంజనేయులు క్రికెట్ స్టేడియం వద్ద ఉన్నాడని తెలుసుకుని నలుగురు అక్కడకు వెళ్ళారు. ఆటోలో ఉన్న రామాంజనేయుల్ని నలుగురు కల్సి బయటకు లాగి పిడిగుద్దులు గుద్ది ….గొంతు నులిమి చంపారు.