Paritala Sunitha : ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్‌ను కలిసి తీరుతాం- పరిటాల సునీత
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్‌ను తాము కలిసే తీరతామని మాజీమంత్రి పరిటాల సునీత తేల్చి చెప్పారు.
- Naveen
- Published On : June 13, 2022 / 04:54 PM IST
Paritala Sunitha
Paritala Sunitha : ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము సీఎం జగన్ ను కలుస్తాం అని టీడీపీ నేత, మాజీమంత్రి పరిటాల సునీత తేల్చి చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడారు. ఇవాళ అడుగుడుగునా అడ్డంకులు సృష్టించారని, మమ్మల్ని ఆపాలని చూశారని పరిటాల సునీత మండిపడ్డారు. అయినా కలెక్టరేట్ వరకు వచ్చామన్నారు.
రేపు ముఖ్యమంత్రిని కలుస్తాం అని చెప్పారు. జిల్లా రైతుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు పరిటాల సునీత. సీఎం సభకు రాకపోతే.. అమ్మ ఒడి, పింఛన్లు రద్దు చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని పరిటాల సునీత ఆరోపించారు.
Vallabhaneni Vamsi Vangaveeti Radha : గన్నవరంలో ఏం జరుగుతోంది? వంశీ, వంగవీటి రాధ మధ్య ఏకాంత చర్చలు
సత్యసాయి జిల్లాలో రైతు సమస్యలపై టీడీపీ ఛలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నేతలు పుట్టపర్తి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌లను రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సునీత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతు సమస్యలపై కలెక్టరేట్‌కు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఒక వాహనంలోనే వెళ్లాలని పోలీసులు సూచించగా.. పోలీసుల తీరుపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా నియంత రాజ్యమా..? అంటూ మండిపడ్డారు.
Roja Atmakur Campaign : ఆత్మకూరు ఉపఎన్నిక.. గెలుపు ఎవరిదో చెప్పేసిన మంత్రి రోజా
మరోవైపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోలీసులు అనంతపురంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో కలెక్టరేట్‌కు వెళతారని ముందుగానే అలర్ట్ అయిన పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. తాము రైతాంగ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే .. పోలీసుల ద్వారా హక్కులను హరిస్తున్నారని ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించకుండా సీఎం జగన్ జిల్లాకు ఏ విధంగా వస్తారని.. ప్రజలకు సమధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే.. పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేయడం సరికాదని ధ్వజమెత్తారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
మరోవైపు జిల్లా కలెక్టరేట్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కలెక్టరేట్‌కు వచ్చే అన్ని వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తున్న వాహనాలను, వ్యక్తులను పోలీసులు నిశితంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు.
