Roja Atmakur Campaign : ఆత్మకూరు ఉపఎన్నిక.. గెలుపు ఎవరిదో చెప్పేసిన మంత్రి రోజా

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో వైసీపీ జోరు పెంచింది. పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం ముమ్మరం చేసింది.

Roja Atmakur Campaign : ఆత్మకూరు ఉపఎన్నిక.. గెలుపు ఎవరిదో చెప్పేసిన మంత్రి రోజా

Roja Atmakur Campaign

Roja Atmakur Campaign : నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో వైసీపీ జోరు పెంచింది. పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం ముమ్మరం చేసింది. ఈ ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ అందుకు అనుగుణంగా ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్తోంది. తాజాగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా రంగంలోకి దిగారు. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేశారు. విపక్షాలను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా బీజేపీపై రోజా విరుచుకుపడ్డారు. విమర్శలు, ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ ఉపఎన్నికలో గెలుపు ఎవరిదో కూడా రోజా చెప్పేశారు.

మంత్రి ఆర్కే రోజా వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా వైసీపీ గెలుపు ఖాయం అని జోస్యం చెప్పారు. నామమాత్రపు పోటీలో బీజేపీ నిలవడం అవసరమా? అని మంత్రి రోజా ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో.. ఏపీలో అమలవుతున్న పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని అడిగారు.(Roja Atmakur Campaign)

Roja Satires On Pawan : పవన్‌కు ఒకటే ఆప్షన్ – జనసేనాని మూడు ఆప్షన్లపై మంత్రి రోజా సెటైర్

”బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమ్మఒడి లేదు? ఎందుకు వైఎస్ఆర్ చేయూత లేదు? ఎందుకు ఆసరా లేదు? ఎందుకు నాడు నేడు అమలు చేయడం లేదు? ఎందుకు ఈబీసీ నేస్తం లేదు? వాళ్ల రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదో మీరు అడగాల్సిన అవసరం ఉంది” అని ఓటర్లను ఉద్దేశించి రోజా అన్నారు.

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెళ్లేరు గ్రామంలో మంత్రి రోజా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ ను విమర్శించే ఆ బ్లడీ ఫూల్స్ అందరికీ బాక్సులు బద్దలయ్యేలా ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయండి అంటూ పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రులు పాలించారు. కానీ, వారందరి చరిత్రను తిరగరాస్తున్న చరిత్రకారుడు వైఎస్‌ జగన్‌ అని రోజా అన్నారు. జగన్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి చెప్పారు.

Chandrababu On Atmakur ByElection : ఆత్మకూరు ఉపఎన్నిక… టీడీపీ పోటీపై చంద్రబాబు క్లారిటీ

”ఆత్మకూరు ఉపఎన్నికల్లో మరోసారి సత్తా చాటే అవకాశం వచ్చింది. రూ. లక్ష 40 కోట్లతో ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అర్హులకు పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. జగన్ ప్రభుత్వంలో అర్హులకు పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన ఉదయమే వాలంటర్ మీ ఇంటికే వచ్చి అందజేస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డిని లక్షకు పైగా మెజార్టీతో గెలిపించి జగన్ కి కానుకగా ఇవ్వాలి” అని మంత్రి రోజా పిలుపునిచ్చారు.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆత్మకూరు ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ దూరంగా ఉంది. దీంతో పోటీ ప్రధానంగా వైసీపీ, బీజేపీల మధ్యే. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ ఉన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw