Andhra Pradesh : ఏపీలో దారుణం.. మహిళను ఇంటికి పిలిపించుకొని హత్యచేసి.. పొలంలో పాతిపెట్టి..

Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మరో మహిళను హత్యచేసి తన పొలంలో పాతిపెట్టింది.

AP Crime

Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఓ మహిళ మరో మహిళను హత్యచేసి.. పొలంలో పాతిపెట్టింది. మార్కాపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read : Nepal Floods : మరో జలప్రళయం దూసుకొస్తోంది.. నేపాల్‌ను హెచ్చరించిన చైనా..

పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి (32) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు జులై 21న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలు ఓ మహిళకు వడ్డీకి రూ.50లక్షలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసులు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలక్ష్మీని తానే హత్యచేసినట్లు ఒప్పుకుంది.

అప్పుగా ఇచ్చిన రూ. 50లక్షలు తిరిగి ఇస్తానని ఆదిలక్ష్మిని నిందితురాలు తన ఇంటికి పిలిపించుకుంది. ఆ తరువాత ఆదిలక్ష్మిని హత్యచేసి.. మృతదేహాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి తన పొలంలో పాతిపెట్టింది. నిందితురాలు ఇచ్చిన సమాచారంతో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందం సాయంతో పొలంలో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా.. నిందితురాలితోపాటు ఆమె కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.