నేను బతికే ఉన్నా.. నా ఉద్యోగం నాకే ఇవ్వండి అంటూ ఓ పారిశుద్ధ్య కార్మికురాలు అర్జీ పెట్టుకోవడం చర్యనీయాంశం అయ్యింది. నెల్లూరు నగరపాలకసంస్థలో ఈ ఘటన చోటచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బతికున్న శాశ్వత పారిశుద్ధ్య కార్మికురాలిని 2012లోనే చనిపోయినట్లుగా నమోదు చేసి, ఆమె స్థానంలో మరో మహిళకు ఉద్యోగం ఇచ్చేశారు నగరపాలకసంస్థ అధికారులు.
దీంతో బాధిత మహిళ కృష్ణమ్మ తనకు న్యాయం చెయ్యాలంటూ నగరపాలకసంస్థ ఆరోగ్యాధికారి వెంకటరమణను కలిసింది. నేను బతికే ఉన్నాను.. ఉద్యోగం ఇప్పించి న్యాయం చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మ అర్జీ పెట్టుకోగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బతికున్న పారిశుద్ధ్య కార్మికురాలికి డెత్ సర్టిఫికేట్ మంజూరు చేసి మరో మహిళకు ఉద్యోగం కల్పించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మహిళ ఎవరో తనకు తెలియదని, తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేయించి కృష్ణమ్మకు న్యాయం చేస్తామని ఆరోగ్యాధికారి తెలియజేశారు.