YCP Bus Yatra (1)
YCP Bus Yatra : వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర శ్రీకారం చుట్టింది. నేడు శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు సామాజిక సాధికార బస్సుయాత్ర జరుగనుంది. ఉదయం 10 గంటలకు ఉత్తరాంధ్ర వైసీపీ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి ఇచ్చాపురంకు బస్సు యాత్రలో ఉత్తరాంధ్రా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్ లు బయలు దేరనున్నారు.
బస్సు యాత్ర బృందానికి మడపాం టోల్ గేట్ వద్ద నరసన్నపేట నేతలు స్వాగతం పలకనున్నారు. కోటబొమ్మాళి వద్ద టెక్కలి నేతలు బస్సుయాత్రకు స్వాగతం పలకనున్నారు. పలాసలో బస్సుయాత్రకు లంచ్ బ్రేక్ ఉంటుంది.
Gold Price Today : బంగారం ధరల్లో భారీ మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?
ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం బూరగాం గ్రామ సచివాలయంను మంత్రులు, ప్రజా ప్రతినిధులు సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చాపురం బస్టాండ్ లో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నారు.