Seediri Appala Raju : వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.. అడ్డుకున్న వైసీపీ శ్రేణులు.. తీవ్ర ఉద్రిక్తత..

Seediri Appala Raju Arrest : వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని తన నివాసంలో పోలీసులు అప్పలరాజును అరెస్టు చేశారు.

Seediri Appalaraju arrested

Seediri Appala Raju Arrest : వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని తన నివాసంలో పోలీసులు అప్పలరాజును అరెస్టు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన్ను అరెస్టు చేయకుండా వైసీపీ శ్రేణులు పోలీసులను అడ్డగించారు. భారీ తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు అప్పలరాజును అరెస్టు చేయొద్దంటూ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అప్పలరాజు సతీమణి ఆయన్ను పట్టుకొని బోరున విలపించారు. చివరకు పోలీసులు అప్పలరాజును బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Also Read : AP Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులు.. పిడుగుల హెచ్చరిక జారీ..

ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్‌తో ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు నుంచి తన కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడికి బదులుగా సిద్దార్ధ త్యాడి అనే వ్యక్తిని జైలుకు పంపాలని చూశారని పోలీసుల విచారణలో తేలింది. సీసీ కెమెరాల ఆధారంగా బైక్ యాక్సిండ్ చేసి దానయ్య మృతికి అప్పలరాజు కుమారుడు కారణమయ్యాడని పోలీసులు నిర్ధారించారు. అయితే, బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టారని, ప్రమాదానికి కారణమైన బైకును తప్పించి నేరం కప్పిపుచ్చేందుకు చూశారని అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ ఏ1గా, సీదిరి అనుచరుడు సిద్ధార్థ త్యాడి ఏ2గా, సీదిరి అప్పలరాజును ఏ3గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే అరవ్, సిద్దార్థలను పోలీసులు జైలు పంపించారు. తాజాగా.. అప్పలరాజును ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలాఉంటే.. న్యాయవాదితో కలసి అప్పలరాజు భార్య జిల్లా జైలుకు వెళ్లి ఆరవ్‌ను కలసివచ్చారు. ప్రమాద ఘటన గురించి సీదిరి అప్పలరాజు ఇప్పటి వరకు నోరు విప్పలేదు. యాక్సిడెంట్‌కు రెండురోజుల ముందే ఆరవ్‌ వర్మకు ఎల్‌ఎల్‌ఆర్‌ జారీ కావడంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.