AP Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులు.. పిడుగుల హెచ్చరిక జారీ..
AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Heavy Rain Alert
AP Rain Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు (గురువారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో భీకర గాలులతోపాటు.. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read : Nandamuri Deepika : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వదినమ్మ..? టీడీపీ పోస్టర్స్‌తో వైరల్.. బయటకొచ్చిన నందమూరి దీపిక..
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మార్కాపురం జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఇక మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
వర్సాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, అప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాలు, పిడుగుల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.
