YCP leaders distributed liquor during Ganesh Yatra in Guntur
YCP Leaders Distribute Liquor : గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల నిర్వాకం బయటపడింది. అత్యంత పవిత్రంగా జరగాల్సిన గణేష్ నిమజ్జనం వేడుకల్లో వైసీపీ నేతలు మద్యాన్ని ఏరులైప్రవహింపజేశారు. గణేషుడిని నిమజ్జనం చేయటానికి యాత్ర నిర్వహించగా ఆ యాత్రలో మద్యాన్ని పంపిణీ చేశారు. దీంతో ఆ యాత్రలో జనాలు ఎగబడి మరీ మద్యాన్ని తాగారు. గణేష్ నిమజ్జనం వేడుల్లో భాగంగా గుంటూరులో వైసీపీ నేతల అత్యుత్సాహం విమర్శలకు దారి తీసింది. ఓ డ్రమ్ములో మద్యం నింపి ట్రక్కులో పెట్టారు. దాన్ని పంపిణీ చేయటంతో జనాలు భారీగా ఎగబడ్డారు. తాగినవారికి తాగినంత అంటూ పిలిచి మరీ మద్యం పంపిణీ చేశారు. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘనకార్యం జరగటం గమనించాల్సిన విషయం.
తాడేపల్లి గేటు సెంటర్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..పోలీసుల సమక్షంలోనే ఇలా గణేషుడి ఊరేగింపులో మద్యం పంపిణీ చేశారు. పోలీసులు చూసినా ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించారు. అదే ఏ సాధారణ వ్యక్తులో ఇదే పనిచేస్తే పోలీసులు అత్యుత్సాహం మామూలుగా ఉండకపోయేది. అర్జంటుగా అరెస్ట్ చేసి కేసులు బనాయించేవారని సాక్షాత్తు అధికార పక్ష నాయకులే ఇలా చేయటంతో పోలీసులు ఏమాత్రం పట్టనట్లుగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.