MLA Grandhi srinivas : సత్యదేవుని సాక్షిగా పవన్ పచ్చి అబద్దాలాడుతున్నారు : వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి
పవన్ కళ్యాణ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకసారి పొత్తు ఉంది అంటారు. మరోసారి లేదంటారు. ఆయన లెక్కేంటో తిక్కేంటో ప్రజలకే కాదు మహా మహా మేధావులకి అర్థం కావడం లేదు.
- nagamani
- Published On : June 17, 2023 / 05:03 PM IST
Pawan Kalyan..grandhi srinivas
Pawan Kalyan..grandhi srinivas : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వారాహి’ యాత్ర మొదలైనప్పటినుంచి వైసీపీ ప్రభుత్వంపైనా..నేతలపై విమర్శలాస్త్రాలు సంధిస్తున్నారు. వాటికి వైసీపీ నేతలు కూడా అంతే ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. దీంట్లో భాగంగానే పవన్ తన చెప్పులు పోయాయని వైసీపీ ప్రభుత్వం గుడిలో తన చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతోంది అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు మండిపడ్డారు. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.
వారాహి నారాహి యాత్ర పేరుతో సత్యదేవుని సాక్షిగా పవన్ కళ్యాణ్ అబద్దాలు ఆడుతున్నారంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి సిద్ధం అంటున్న పవన్ ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు ఇస్తారా? లేక బిజెపి ఇస్తుందా..? అంటూ ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యే కావటానికి పార్టీ పెట్టాలా అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నానని అన్నారు.
సత్య దేవుని ఆలయం వద్ద చెప్పులు పోయాయని పవన్ కళ్యాణ్ మాట్లాడడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారని..ఒకసారి పొత్తు ఉంది అంటారు.. మరోసారి లేదంటాు..ఇటువంటి గందరగోళంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన లెక్కేంటో తిక్కేంటో ప్రజలకే కాదు మహా మహా మేధావులకి అర్థం కావడం లేదంటూ సెటైర్లు వేశారు.
