Pawan Kalyan..Granthi Srinivas
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వంపైనా, నేతలపైనా పవన్ విమర్శలు..వైసీపీ నేతల ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ పై పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఎల్ కె జీలో చేర్పించడానికి అనుమతి ఇవ్వాలని CM జగన్మోహన్ రెడ్డిని కోరతాను అంటూ గ్రంధి శ్రీనివాస్ సెటైర్లు వేశారు. ఎల్ కె జి చదవడానికి మూడేళ్ల వయసు కావాలి..కానీ పవన్ కు 55 ఏళ్ల వయసు. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి అనుమతి కోరతాను అంటూ ఎధ్దేవా చేశారు.
Vijayasai Reddy: పవన్ కల్యాణ్ కు విజయసాయి కౌంటర్.. విరుచుకుపడుతున్న జనసైనికులు
పవన్ కు లెక్కలు రావు భీమవరం నియోజకవర్గంలో లక్షా 40 వేల ఓట్లు ఉంటే లక్ష 8 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పడం ఆయనకు లెక్కలు తెలియవని స్పష్టమవుతుంది అంటూ విమర్శించారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా, వారిని మోసం చేసేలా పవన్ మాట్లాడుతున్నారని..నాకు వేషాలు వేయడం, డాన్స్ చేయడం రాదు. .ప్రజలను మోసం చేయడానికి డాన్స్ చేసేవారు, వేషం వేసేవారు వస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ గ్రంథి సెటైర్లు వేశారు.