Perni Nani : పవన్ కల్యాణ్‌కు రెండు చెప్పులు చూపించిన పేర్ని నాని .. నీకంటే పెద్ద మగాడిని అంటూ ఘాటు వ్యాఖ్యలు
పవన్ తన వాహనానికి ‘వారాహి’అని పేరు పెట్టుకున్నారు కానీ ‘నారాహి’ అని పెట్టుకోవాల్సింది. పవన్ చెప్పు చూపిస్తు విమర్శలు చేస్తున్నారని చెప్పులు పవన్ కే కాదు నాక్కూడా ఉన్నాయి అంటూ తన రెండు చెప్పులు చూపించి మరీ విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.
- nagamani
- Published On : June 15, 2023 / 12:05 PM IST
Perni Nani Pawan Kalyan Varahi Yatra
Pawan kalyan Varahi Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ తన వాహనానికి ‘వారాహి’అని పేరు పెట్టుకున్నారు కానీ ‘నారాహి’ అని పెట్టుకోవాల్సింది అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు పవన్ చెప్పు చూపిస్తు విమర్శలు చేస్తున్నారని చెప్పులు పవన్ కే కాదు నాక్కూడా ఉన్నాయి అంటూ తన రెండు చెప్పులు చూపించి మరీ విమర్శలు చేశారు. ఒక్క చెప్పు చూపిస్తేనే పెద్ద మొగోడినని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారని..కానీ తాను రెండు చెప్పులు చూపిస్తున్నానని అన్నారు. పవన్ కంటే పెద్ద మొగోడినంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
పవన్ తన లారీకి ఎందుకు అన్నిసార్లు పూజలు చేయిస్తున్నారు?కొండగట్టు ఆంజనేయస్వామి వద్ద పూజలు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ వద్ద చేయించారు. ఇప్పుడు యాత్ర ప్రారంభిస్తు మరోసారి అన్నవరంలో ఇలా ఎందుకు ఇన్నిసార్లు ఇన్ని చోట్ల పూజలు చేయిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. పవన్ జనాన్ని నమ్ముకుంటే గెలుస్తారు…కానీ ఆయన వ్యూహాన్ని నమ్ముకుంటున్నారు వ్యూహాన్ని నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు అంటూ ఎద్దేవా చేశారు. పవన్ వ్యూహాల్ని, చంద్రబాబుని నమ్ముకుంటే చిల్లర వస్తుంది గానీ గెలవరు అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పవన్ ఎప్పుడన్నా ప్రశ్నించారా? ఏపీ సమస్యలపై ప్రధాని మోదీని ఎప్పుడైనా ప్రశ్నించారా? బీజేపీతో పొత్తులో ఉండి కేసీఆర్ కు ఓట్లేయమని చెప్పిందెవరు? అంటూ ప్రశ్నలు సంధించారు. పదేళ్ల నుంచి జనసేన పార్టీని నడుపుతోంది చంద్రబాబే అంటూ ఆరోపించారు.
Pawan Kalyan: భవిష్యత్తులో వైసీపీని ఎదుర్కొనేది జనసేన పార్టీ మాత్రమే.. ఎలాగంటే?: పవన్ కల్యాణ్
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీపై కామెంట్లు చేసినప్పుడు పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? గులాబీ జెండాను జేబులో పెట్టుకుని తిరుగుతోంది ఎవరు? అంటూ ప్రశ్నించారు. తన సినిమాలకు టికెట్ ధరలు తగ్గించారని వైసీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తున్నారు. జనసేన మద్దతు ఇచ్చిన టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో ఇటువంటివి జరగలేదా? అని ప్రశ్నించారు. జనసేన పార్టీ చంద్రబాబు కోసమే పనిచేస్తోందని విమర్శించారు.
కాగా..పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర ప్రారంభించారు. బుధవారం (జూన్ 14,2023) అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిథిలో వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కూడా ప్రత్యేక పూజలు చేసిన తన వారాహి వాహనంపై యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కత్తిపూడిలో సభ నిర్వహించారు. వారాహిపైనుంచి ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ ఎదరించే ధైర్యం..సత్తా ఉన్న పార్టీ జనసేన అని అన్నారు. వైసీపీ నేతలు తననే టార్గెట్ చేస్తున్నారని అది జనసేన బలం అంటే అని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండీ అణగారిని వర్గాలకు అండగా ఉంటానని కోరారు.
గతంలో పవన్ పలుమార్లు వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తు చెప్పు తీసుకుని కొడతాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా కత్తిపూడిలో మాట్లాడుతు ‘‘దశాబ్దాలుగా ఉన్న పార్టీలు కూడా వైసీపీ (YCP) నాయకులకు బయపెడితే మనం చెప్పు తీసి చూపించాం, అది మన బలం ” అని అన్నారు. భవిష్యత్తులో వైసీపీని ఎదుర్కొనేది జనసేన పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కత్తిపూడిలో ఆయన వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) ప్రారంభించి ప్రసంగించారు. దీంతో పేర్ని నాని పవన్ పై తనదైన శైలిలో సెటైర్లతో విరుచుకుపడ్డారు. చెప్పులు మీకే కాదు మాకు ఉన్నాయి అంటూ రెండు చెప్పులు తీసి చూపించారు.
