Prasanna Kumar Reddy: లక్షిత ఘటనలో నా వ్యాఖ్యలపై దుష్ప్రచారం.. పసిబిడ్డ మృతిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది..

నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత (6) అనే చిన్నారిని చిరుత హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల ఘాట్ రోడ్డులో లక్షితపై చిరుత దాడిచేసి హతమార్చింది.

MLA Prasanna Kumar Reddy

Nallapareddy Prasanna Kumar Reddy: లక్షిత ఘటనపై నేను చేసిన వ్యాఖ్యలను టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షిత తల్లిదండ్రులమీద అనుమానం ఉందని, వారిని ఎంక్వైరీ చేయాలని నేను అనలేదని, ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై క్షుణ్ణంగా పరిశీ‌లించి విచారణ చేయాలని మాత్రమే అడిగానని ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. నాపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. ఈ ఘటనపైకూడా టీడీపీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Nallapareddy : తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి ఘటన.. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అలిపిరి మెట్లు ఎక్కేవరకు తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకోండని మాత్రమే మాట్లాడా.. తల్లిదండ్రులు ఎవరూ బిడ్డలను చంపుకోరు. లక్షిత కుటుంబం మాకు చాలా ముఖ్యం. ఒక పసిబిడ్డ మృతిని కూడా టీడీపీ రాజకీయంగా వాడుకోవాలనుకుంటుందని ప్రసన్న కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులుకూడా ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై మొదట అయోమయానికి గురయ్యారు. కరమంత్రం అయిన తర్వాత లక్షిత కుటుంబాన్ని కలిసి మాట్లాడతా అని ఎమ్మెల్యే చెప్పారు. లక్షిత కుటుంబానికి టీటీడీ బోర్డు రూ.5లక్షలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూ.5లక్షలు, మా ట్రస్ట్ తరఫున రూ. 2 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించామని ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పారు.

Tirumala Cheetah Attack : తిరుమలలో బాలికను చిరుత చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టు

నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత (6) అనే చిన్నారిని చిరుత హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల ఘాట్ రోడ్డులో లక్షితపై చిరుత దాడిచేసి హతమార్చింది. అయితే, ఈఘటనపై శనివారం నెల్లూరులో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బాలిక తల్లిదండ్రులపై అనుమానం ఉందని, సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులు, టీటీడీ అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ఎమ్మెల్యే స్పందిస్తూ.. అలా నేను అనలేదని చెప్పారు. తన వ్యాఖ్యలపై కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు